కోలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న కన్నడ హీరో?
ఈ మద్య కొంత మంది హీరోలు కథ విషయం నచ్చితే ఏ పాత్ర అయినా ఓకే అంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అయిన జగపతి బాబు ప్రస్తుతం టాప్ విలన్ గా నటిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ, కన్నడంలో ఎన్నో సినిమాల్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అర్జున్ ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నారు. త్వరలో శ్రీకాంత్ సైతం విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య నటించిన యుద్దం శరణం మూవీలో విలన్ గా నటించారు. ఇక కన్నడంలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కిచ్చ సుదీప్ ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నారు.
ఆ మద్య రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ మూవీలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు. ఈ మూవీలో ఈగతో సుదీప్ చేసే యాక్షన్ కడుపుబ్బా నవ్వించింది. ఇక శుక్రవారం ప్రభుదేవ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ లో విలన్ గా నటించారు. అయితే ఇప్పటి వరకు సుదీప్ తమిళ సినీ పరిశ్రమలో తన సత్తా చాటలేదు. తాజాగా మరో చిత్రంలో నెగెటివ్ రోల్లో కనిపించనున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి తెలుగు, హిందీ సినిమా కాకుండా తమిళ సినిమాలో విలన్గా కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ లో స్టార్ హీరో శింబు గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిస శింబు నటిస్తున్న కొత్త సినిమాలో సుదీప్ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందు కోసం నిర్మాతలు కిచ్చ సుదీప్ ని సంప్రదించినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఒకవేళ సుదీప్ గనక ఓకే అంటే ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టైలిష్ విలన్ దొరికినట్లే అంటున్నారు. గతంలో విజయ్ నటించిన పులి సినిమాలో సుదీప్ విలన్గా నటించిన విషయం తెలిసిందే.