అల వైకుంఠపురములో రన్ టైమ్ విషయంలో అల్లు అర్జున్ డిమాండ్..!

shami

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, టబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమా మొదటి నుండి త్రివిక్రమ్ బన్ని మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయి రిలీజ్ కు రెడీ అవుతున్నా ఇప్పుడు కూడా రన్ టైమ్ విషయంలో డైరక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల మధ్య గొడవ మొదలైందని తెలుస్తుంది. సినిమా రన్ టైమ్ రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. 

త్రివిక్రమ్ ఈ సినిమాను ఫైనల్ కట్ 185 నిముషాలు చేశాడట. కాని అల్లు అర్జున్ 2:25లోనే పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టాడట. ఈమధ్య సినిమాలు 3 గంటలు నిడివితో వస్తున్నాయి. అయితే అలా అని రిస్క్ చేయడం కరెక్ట్ కాదు బన్ని చేసిన నా పేరు సూర్య కూడా 3 గంటల డ్యూరేషన్ తో వచ్చింది. కాని ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. అందుకే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో విషయం లో జాగ్రత్త పడుతున్నాడు.

మరి ఫైనల్ రన్ టైమ్ ఎంత ఉంచుతారో తెలియాల్సి ఉంది. సినిమా  సాంగ్స్ తో బాగా క్రేజ్ తెచ్చుకోగా సంక్రాంతికి సరైన సినిమాగా అల వైకుంఠపురములో హంగామా చేయడం కన్ఫామ్ అంటున్నారు. సినిమా మీద మెగా, అల్లు ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినిమా అభిమానులు మంచి అంచనాలతో ఉన్నారు. మరి ఈ సినిమా ఆ రేంజ్ ను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: