రత్తాలు ఎవరినీ నిద్రపోనిచ్చేట్టుగా లేదుగా!
సినిమాల్లో గ్లామర్ పాత్రలు వేసే హీరోయిన్ల గెటప్పులు, డ్రెస్సులకు కొన్ని ఆంక్షలు ఉంటాయి. సినిమా కథకు, పాటలకు, సినీ నేపథ్యానికి తగ్గట్టు వాళ్ల క్యాస్ట్యూమ్స్ ఉంటాయి. గ్లామరస్ గా ఎంతగా కనబడినా సినిమాలో మహా వచ్చే ఓ నిముషం పాటే. ఆయా రకాల డ్రెస్సుల్లో తమ గ్లామర్ ఒలకబోస్తూ ఉంటారు. సినిమాలతో పాటు వెకేషన్స్ లోనూ, ఫోటోషూట్స్ లోనూ తమ గ్లామర్ ను ఒలకబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇందుకు వీరికి దొరికిన ఫ్రీ స్పేష్ సోషల్ మీడియా. అవకాశం వస్తే బీచ్ ల్లో వాలిపోయే లక్ష్మీరాయ్ తన అందాలను ఆరబోస్తూ ఎంజాయ్ చేస్తోంది.
తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినా ఐటమ్ సాంగ్స్ ద్వారా బాగా పాపులరైన లక్ష్మీరాయ్ ఇదే పాటిస్తోంది. వెకేషన్స్ కు ఎక్కువగా వెళ్లే లక్ష్మీరాయ్ తాజాగా ఓ వేకేషన్ కు వెళ్లింది. వెళ్లటమే తరువాయి.. తనకు ఇష్టమైన బికినీలో విహరించింది. అసలే ఈమధ్య కాస్త స్లిమ్ గా తయారైందేమో బికినీలో వెకేషన్ ను ఎంజాయ్ చేసింది. తెల్లని బికినీ పీస్ లో ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తన ఫొటోలకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘నేను మారలేదు. ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇదే నేను’ అంటూ తన వాల్ లో రాసుకుంది రత్తాలు. ఇలాగే బికినీలో స్టిల్స్ ఇస్తూంటే మాలాంటి అభిమానులు ఏమైపోవాలి.. అంటూ నెటిజన్లు రత్తాలకు సరదాగా రిప్లైలు ఇస్తున్నారు.
auto 12px; width: 50px;">View this post on InstagramChristmas is coming.... 🎅🎄 HO HO HO.... 🎄 #pinkflemingo #beachlife #muchneeded A post shared by Raai Laxmi (@iamraailaxmi) on
గతంలో ఓ స్టిల్ బయటకు రావాలంటే వారానికోసారి, నెలకోసారి వచ్చే సినీ పత్రికల్లోనే. కానీ ఇప్పుడు నిమిషాలు, సెకన్లలోనే తమ స్టిల్స్, ఫోటోస్, సరదాలు.. అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. నిజానికి.. సినిమాల కంటే ఇప్పుడు వారికి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే మంచి పాపులారిటీ వస్తోందనడంలో సందేహం లేదు.
auto 12px; width: 50px;">View this post on InstagramI dint change I just found myself. 🥰❤️ #mondaymotivation #mondayblues #sealove ❤️ A post shared by Raai Laxmi (@iamraailaxmi) on