నితిన్, నిత్య లు మళయాలంలో కూడా ఇష్క్ అంటున్నారట

Narayana Molleti
వేరే లాంగ్వేజ్ చిత్రాలు మన దగ్గర డబ్ అవ్వడం ఎప్పటినుండో జరుగుతుంది కానీ మన సినిమాలు వేరే దగ్గర డబ్ అవడం ఇప్పుడు తరచు జరుగుతుంది. ఇప్పుడు అదే కోవలో మళయాలంలోకి నితిన్ సినిమా డబ్ అవుతుంది.. చాలా కాలం గా హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ కి సూపర్ క్రేజ్ ని తెచ్చిపెట్టిన ఇష్క్ సినిమా మళయాలంలో డబ్ అవుతుంది. సాధారణంగా మన తెలుగు సినిమాలు కన్నడ , మళయాలంలో డబ్బింగ్ అవుతున్నాయి. విక్రం దర్శకత్వం వహించిన ఇష్క్ సినిమా ఫ్లాప్ తో పోరాటం చేస్తున్న నితిన్ కి గ్రాండ్ హిట్ ని ఇచ్చింది. అంతేకాదు తను ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియెన్స్ చూస్తారన్న విషయం మీద కూడా నితిన్ కి ఒక క్లారిటీ వచ్చింది ఈ సినిమాతోనే. ఇక నితిన్, నిత్య ల లవ్ సీన్స్ తెలుగు ప్రేక్షకులను ఒక కొత్త అనుభూతికి లోనయ్యేలా చేశాయి. ఇదే ఫీల్ ని అక్కడ కూడా కొనసాగించి మల్లూవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు ఈ చిత్ర దర్శక, నిర్మాతలు.. ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అవ్వడానికి అనూప్ అందించిన మ్యూజిక్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. యూత్ ని ఆకట్టుకునే మంచి మ్యూజిక్ ఆల్బం ఇచ్చిన అనూప్ ఈ చిత్ర విజయానికి ఒక బాధ్యుడయ్యాడు. అనూప్ మ్యూజిక్ కి నితిన్ , నిత్య లు కూడా క్యూట్ గా డ్యాన్స్ వేస్తూ ఆడియెన్స్ ని బాగా అలరించారు. ఆ తర్వాత నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమా కూడా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా అంత ప్రేక్షకాదరణ పొందడానికి ఇష్క్ సినిమా ఒక కారణమని చెప్పొచ్చు. సో మొత్తానికైతే వేరే భాషల నుండి మన దగ్గరకు వచ్చి సక్సెస్ అవుతున్న సినిమాల్లానే మన సినిమాలు కూడా వేరే భాషల్లోకి డబ్ అయ్యి మంచి సక్సెస్ ని సాదించాలని కోరుకుందాం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: