ఆదిలో మరింత జోరు.. మధ్యలో మరింత బోరు సినిమాలు ఇవే ..
సినిమాలకు ప్రేక్షకులకు వెళ్లాలంటే సినిమా అన్ని విధాలా ఆకట్టుకునేలా ఉండాలి. అప్పుడే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తారు. అయితే, ఈ మధ్య వస్తున్నా సినిమాలన్నీ కూడా భారీ కథనంతో, భారీ బడ్జెట్ తో వస్తున్నా విషయం తెలిసిందే. అది కూడా అగ్ర హీరోల చిత్రాలు కావడం మరింత విశేషం. అయితే చాలా సినిమాలు సినిమా మొదలైనప్పుడు బాగా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంటాయి. హిట్ అవుతుందనే లోపు సినిమా మొదటి రోజులోనే మూట ముల్లె సర్దుకుంటుంది. అలా చూసుకుంటే చాలా సినిమాలో ఈ మధ్య కాలంలో భారీ డిజాస్టర్ గ మిగిలాయి.
అలా చూసుకుంటే ఈ ఏడాది ఆదిలో సినిమాల జోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.. అయితే సంకేతంతి కానుకగా విడుదలయిన ఒక్క వెంకటేష్ ఎఫ్ 2 సినిమా తప్ప మొదట ఏ సినిమా అంతగా విజయాలను అందుకోలేక పోయాయి. ఈ తర్వాత ఫిబ్రవరిలో దాదాపుగా 15 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఏ సినిమా కూడా భాక్సాఫీస్ రికార్డులను అందుకోలేక పోయాయి. కనీసం ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోలేక పోయాయి. వైస్సార్ పాత్రలో వచ్చిన యాత్ర సినిమా కూడా ఫ్లాప్ అయిందనే చెప్పాలి.
మొత్తానికి సినిమాలు అనేవి ఎక్కడ కూడా మంచిగా లేవనే చెప్పాలి.మార్చ్ నెలలో 118, ఆ నిమిషం, క్రేజీ క్రేజీ ఫీలింగ్, మరో అడుగు మార్పు, మౌనమే ఇష్టం, అశోక్ రెడ్డి, బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్, కాలేజ్ పోరగాళ్ళు, జస్సీ, మాగ్నట్, మనసా వాచా, ప్రాణంఖరీదు, వేరీజ్ ద వెంకటలక్ష్మి, ప్రేమతో చెప్పనా, అదృశ్యం, చెడ్డిగ్యాంగ్, కమల్, వనం, చీకటి గదిలో చితక్కొట్టుడు, వినరాసోదర వీరకుమారా, లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం విడుదలయ్యాయి ఒక్క 118 సినిమా మాత్రమే ఒక్క మాదిరిగా ఉందని టాక్ తెచ్చుకుంది.
విషయానికొస్తే సినిమాలు సంవత్సరం పొడవునా విడుదల అయినా కూడా అందులో చాలా సినిమాలో భారీ బడ్జెట్ తో వచ్చిన కూడా ఒక్క రోజులోనే బయటకు వచ్చేసాయి. ఈ కోణంలోకి సాహో, సైరా ఇలాంటి సినిమాలకు కూడా చుక్కెదురైంది. విడుదలయిన టీజర్లు , ట్రైలర్లు, పాటలు సినిమా పై అంచనాలను పెంచిన కూడా విడుదలయిన వెంటనే మిశ్రమ టాక్ తో కొద్దీ రోజులు మాత్రమే కనిపించాయి. వాటితో పోలిస్తే మజిలీ వంటి చిన్న సినిమాలే భారీ హిట్ ని అందుకున్నాయి. అదండీ పైన పటారం లోన లొటారం లా సినిమా పరిస్థితి..