అల వైకుంఠపురములో పవన్ జ్ఞాపకాలు !
సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈ పండుగకు రాబోతున్న సినిమాలకు సంబంధించిన వార్తలు లేకుండా రోజు గడవడం లేదు. ముఖ్యంగా రోజురోజుకి ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ కు సంబంధించి ఏ లీక్ వచ్చినా అది క్షణాలలో వైరల్ గా మారుతోంది.
ఇప్పటివరకు ‘అల వైకుంటపురములో’ కు సంబంధించి వచ్చిన నాలుగు పాటల్లో మూడుపాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీనితో బన్నీ అభిమానులు ఈ మూవీలో ఏ పాట తరువాత ఏ పాట వస్తుంది అన్న విషయమై ఊహాగానాలు మొదలు పెట్టేసారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ ఎడిటింగ్ రూమ్ దగ్గ ర నుండి వస్తున్న లీకుల ప్రకారం ఈ సినిమాలో తొలుతగా వచ్చే సాంగ్ ‘ఓ మై డాడీ’ అంటూ ర్యాప్ స్టయిల్ లో సాగే పాట అని అంటున్నారు.
ఆ తరువాత వచ్చే పాట 'సామజవరగమన' సాంగ్ అని ఆ తరువాత 'అల వైకుంఠపురములో' పాట ఉంటుందని లీకులు వస్తున్నాయి. అయితే ఈ పాటకు ముందు ‘అత్తారింటికి దారేది’ లో వచ్చినట్లే శాస్త్రీయ ఆలాపన కూడా ఉంటుంది అంటూ ఇది ఒక అష్టపది అని అంటున్నారు. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ తరువాత ‘బుట్ట బొమ్మ’ సాంగ్ వస్తుంది అన్న లీకులు వస్తున్నాయి.
ఇక చివరిగా ఈ సినిమా క్లైమాక్స్ ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో ‘రాములో రాములా’ సాంగ్ ఉంటుందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే శ్రీకాకుళం జానపద స్టైల్ లో వచ్చే ఒక చిన్న పాట కూడ ఉన్నప్పటికీ ఆ పాటను చివరి వరకు రహస్యంగా ఉంచి ఏకంగా సినిమాలోనే చూపెడతారు అని టాక్. త్రివిక్రమ్ తన సినిమాలలోని సన్నివేశాల విషయంలోనే కాకుండా పాటల ప్లేస్మెంట్ విషయంలో కూడ తన క్రియేటివిటి చూపిస్తాడు అన్న విషయం తెలిసిందే..