మహేష్‌తో పోరు.. వెనక్కి తగ్గిన బన్నీ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న `అలవైకుంఠపురంలో`. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అర్జున్ గత సినిమా 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనుకున్నంతగా అలరించకపోవడంతో బన్ని కసితో ఉన్నాడు. ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. దీంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అల వైకుంఠపురంలో సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో టబు, నివేథా పేతురాజ్, జయరామ్, సుశాంత్, నవదీప్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఉంటే.. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 6న గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించనున్నారట. దర్శక నిర్మాతలతో పాటు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు ఈ ఈవెంట్ కి అతిథిగా వచ్చే అవకాశం కలదు. అయితే మహేష్ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ముందు అదే రోజున అదే సమయానికి బన్నీ తన అల వైకుంఠపురములో ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరపాలని భావించినట్టు తెలిసింది. పాటలు, టీజర్ల వరకూ అంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్లు క్లాష్ అంటే ఇబ్బందే. లక్షలు ఖర్చుపెట్టి చేసే ఈవెంట్లకు మైలేజ్ రాకపోతే ఇరు సినిమాలకు కష్టమే. ఈ నేపథ్యంలోనే బన్నీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా, ఇక త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.