నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్. తమిళ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సీ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తాపడింది. బాలయ్య నుంచి కొంత గ్యాప్ తరువాత వచ్చిన మాస్ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంలో బాలకృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. రూలర్‌కు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ రావటంతో కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. దీనికి తోడు రూలర్‌తో పాటు రిలీజ్ అయిన ప్రతిరోజూ పండగే సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో ఆ ప్రభావం కూడా రూలర్ కలెక్షన్ల పై పడింది. సినిమాలో కంటెంట్ సరిగా లేకపోవటం బాలయ్య లుక్ విషయంలో దారుణమైన ట్రోల్స్ రావటంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అయితే ఇదిఇలా ఉంటే...కొంతమంది కథానాయకులు తెరమీదే కాదు, బయట కూడా పెద్ద మనసు చూపిస్తుంటారు. సినిమా నష్టాల పాలైతే, తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత తిరిగి చెల్లిస్తుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా అదే పని చేస్తున్నట్టు తెలుస్తోంది. సి,కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కిన `రూలర్` ఈనెల 20న విడుదలై, డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రూ.40 కోట్లతో ఈసినిమా తీస్తే, పట్టుమని పది కోట్లు కూడా రాలేదు. డిజిటల్, శాటిలైట్ లేకపోతే కల్యాణ్ నిండా మునిగేవాడు. అవి కాస్త ఆదుకున్నాయి. అయినా సరే, భారీ నష్టాల్ని భరించాల్సివస్తుంది. బాలయ్యతో తీసిన పరమ వీరచక్ర కూడా కల్యాణ్‌ని దారుణంగా ముంచేసింది.
ఆ సినిమా అయితే… కనీసం 20 శాతం కూడా వెనక్కి రాబట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకూ ఆ సినిమాకి శాటిలైట్ కూడా అవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకే బాలయ్య తన వంతు సాయం అందించడానికి రెడీ అయ్యాడు. తన పారితోషికంలో కొంత మొత్తం వెనక్కి ఇస్తానని బాలయ్య మాట ఇచ్చాడట. అంతేకాదు… మరో సినిమా కూడా చేసిస్తా అంటున్నాడట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్యతో మరో సినిమా చేసేందుకు కల్యాణ్ ధైర్యం చేయడం లేదు. వినాయక్‌తో అనుకున్న సినిమా ఎప్పుడో కాన్సిల్ అయ్యింది. వినాయక్ మంచి కథ పట్టుకొచ్చినా – ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసే ఉద్దేశంలో మాత్రం కల్యాణ్ లేడనే చెప్పాలి. పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇస్తే చాలని కల్యాణ్ కూడా ఎదురుచూస్తున్నాడు. సో… కల్యాణ్ కి కొంతమేర ఉపశమనం లభించినట్టే.
కేయస్ రవికుమార్, బాలకృష్ణ కాంబినేషన్లో జైసింహా సినిమా సూపర్ హిట్ అయ్యింది, ఆ సినిమాను మించేలా రూలర్ తీశాం.. త్వరలో రూలర్‌ను మించేలా మరో సినిమా చేస్తాం` అంటూ చెప్పాడు సీ కళ్యాణ్ చెప్పాడు. దీంతో అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది.
మరింత సమాచారం తెలుసుకోండి: