దేవాదాయ‌శాఖ ఉద్యోగిగా చిరునా... వ‌ర్క్ అవుట్ అవుద్దా?

Arshu
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, చాలా కష్టపడి ఇష్టంగా చేసిన సినిమా 'సై‌రా'. ఈ చిత్రం విడుద‌లై విజ‌యం సాధించింది. దీంతో తన తదుపరి సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు చిరంజీవి. సోషల్ కాజ్‌కి కమర్షియాలిటీ అద్ది అద్భుతమయిన సినిమాలు తెరకెక్కిస్తున్న కొరటాల శివతో మెగాస్టార్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కొరటాల కూడా చిరంజీవితో చాలా కాలం ట్రావెల్ చేసి బౌండెడ్ అండ్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్ర‌మిది. 

ఒక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే జ‌నాల్లో ఉండే అంచ‌నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొన్నిసార్లు టైటిల్​ చెప్పగానే ఫలానా కథనం ఉంటుందంటూ అభిమానులు సంతోషపడుతుంటారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే చిత్రంపైనా ఇలాంటి వదంతులే వస్తున్నాయి. అయితే అందుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివఈ సినిమాలో చిరంజీవి.. ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడట. అయితే అదీ దేవాలయాల్లో కార్యనిర్వహక విధులు నిర్వర్తించే పాత్ర పోషించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఓ సెట్​ను హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు. అక్కడే త్వరలో షూటింగ్ మొదలు కానుంది. వీటన్నింటిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ మెగా మూవీ 2020 సమ్మర్ ఎండింగ్‌లో లేదా, దసరాకి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకోసం చిరు ఆల్రెడీ తన ఫిజిక్ కూడా మార్చుకుని సన్నగా తయారయ్యారు. ఈ సినిమాలో ఆయన రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు అని ఆల్రెడీ టాక్ నడించింది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా హీరోయిన్స్ ఫైనల్ అవ్వలేదు. ఇప్పటికే ఇలియానా, నయనతార, అనుష్క, శృతి హాసన్‌ల పేర్లు వినిపించాయి. వీళ్ళలో నయనతార, శృతి హాసన్‌లు ఫైనల్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. కొరటాల నిర్ణయాన్ని బట్టి హీరోయిన్స్‌ని కూడా ఫైనల్ చేస్తారు. 

మరోవైపు ఈ మూవీ కోసం చిరు సరసన త్రిష ఫైనల్ అయ్యింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ చిన్న పాత్రలో మెరవబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? చిరు నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటి..? ఎప్పుడు విడుదల కాబోతోంది..? తదితర విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: