రాజధాని విషయమై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు !

Seetha Sailaja

ప్రస్తుతం రాజకీయ నాయకుల దగ్గర నుండి పెద్దగా చదువురాని అతి సామాన్యుల వరకు అందరి మాటల్లోనూ జరుగుతున్న చర్చలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన విషయాలే. ఈ విషయమై ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందించారు కాని మిగతా వారు అంతా తమకు ఈ విషయమే పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

అయితే రాజకీయాలకు చాల దూరంగా ఉంటూ ఎప్పుడు వివాదాలను సృష్టించుకునే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. నిన్న విశాఖపట్టణంలో వర్మ మీడియా వ్యక్తులకు ఎదురైన సందర్భంలో ‘రాజధాని పై మీ అభిప్రాయం ఏమిటి’ అంటూ మీడియా వ్యక్తులు ప్రశ్నించినప్పుడు వర్మ విచిత్రంగా స్పందించాడు. 

"రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిది" అని వర్మ తన సినీ భాషలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. జ‌న‌వ‌రి 1న విడుద‌ల కానున్న తన లేటెస్ట్ మూవీ 'బ్యూటిఫుల్' సినిమా ప్ర‌చారంలో భాగంగా వర్మ తన యూనిట్ తో కలిసి నిన్న విశాఖపట్నంలో జరిగిన తన మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో వర్మ ఈ కామెంట్స్ చేసాడు. 

రాజధాని ఎక్కడ ఉంటే ఏమిటి అని అంటూ సామాన్యులకు రాజధాని వల్ల కష్టాలు తీరుతాయా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. ప్ర‌తి ప‌ట్ట‌ణాన్ని ఒక రాజ‌ధానిగా చేస్తే ప్ర‌జ‌ల‌కు నేరుగా పాల‌న అందుతుంద‌ని వాస్తవానికి రాజ‌ధానిని ప‌క్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా తాను ప‌ట్టించుకోను అంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఒక వైపు రాజధాని పై జరుగుతున్న రగడకు నిన్న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సస్పెన్స్ మరింత కొనసాగుతూ సామాన్యులకు ముఖ్యంగా అమరావతి రైతులకు టెన్షన్ ను పెంచేస్తోంది. అయితే ఈ విషయాల పై కొనసాగుతున్న సస్పెన్స్ వెనుక ఎదో ఒక సీక్రెట్ ఉంది అన్న ప్రచారం జనం మధ్య జరుగుతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: