అభిమానులకు చిరు ఇవ్వనున్న న్యూ ఇయర్ గిఫ్టు ఏంటో తెలిస్తే సర్ప్రైజ్ అవ్వడం ఖాయమట.. !!
తన సినీ జీవితంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా చారిత్రక పాత్ర పోషించిన సినిమా ‘సైరా..నరసింహారెడ్డి’. ఈ చిత్రంలో చిరంజీవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రలో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, తమన్నా, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
ఇకపోతే 2017లో చిరు రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 తో భారీ హిట్ అందుకున్న చిరుకు 2019 లో వచ్చిన ‘సైరా..నరసింహారెడ్డి’ హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ చిరుకు మాత్రం 2019 వ సంవత్సరం చిరకాలం గుర్తుండి పోతుందట. ఎందుకంటే తన కలల సినిమా సైరాని అభిమానులకు చూపించ గలిగాడు. ఈ సినిమా ఆర్థిక విజయాన్ని పక్కన పెడితే, చిరు తన చిరకాల కోరికని ఈ యేడాది తీర్చుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు 2020 కోసం సన్నద్ధం అవుతున్నాడు.
ఇందుకు గాను 2020 తొలి రోజునే అభిమానులకు ఓ కానుక ఇవ్వాలని భావిస్తున్నాడట మెగాస్టార్. అదేమంటే చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఈ చిత్రానికి ఓ పాటతో శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే చిరుపై ఓ ఫొటో షూట్ పూర్తి చేసింది చిత్రబృందం.
ఆ లుక్ ని డిసెంబరు 31 అర్థరాత్రి రివీల్ చేయాలని చిరు భావిస్తున్నాడట. వీలైతే టైటిల్ కూడా అదే రోజు ప్రకటించాలని చూస్తున్నాడట. ఇటీవల మణిశర్మ బ్యాంకాక్ వెళ్లి, ట్యూన్స్ పూర్తి చేసుకొచ్చారు. అందులో రెండు పాటల్ని ఇప్పటికే రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది... ఇకపోతే ఈ విషయం తెలిసిన చిరు అభిమానులు చిరు ఇవ్వనున్న న్యూ ఇయర్ గిఫ్టు కోసం ఎదురు చూస్తున్నారట..