హమ్మయ్యా..షూటింగ్ కంప్లీట్ అయింది...

Pranateja Sriram

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమాని చాలా కేరు తీసుకుని మరీ తెరకెక్కించారని అర్థం అవుతుంది.

 

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల అయిన అన్ని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఒక పాట రిలీజ్ అవడమ్ బ్యాలన్స్ ఉన్న ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ జనవరి ఆరవ తేదీన జరుగుతుందని చెప్పారు. ఈ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా వస్తాడని సమాచారం. ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉండడం వల్ల అభిమానుల్లో  అనేక అనుమానాలు వెల్లువెత్తాయి.

 

విడుదల సమయం దగ్గర పడుతున్నా కూడా ఇంకా షూటింగ్ అవకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు లేటుగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయి. కానీ ఆ ఆలస్యం సినిమా విడుదల మీద పడితే మాత్రం తీవ్ర నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది.  అయితే ఈ సినిమా షూటింగ్ గురించి నేడో వార్త వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఈ రోజు సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.

 

ఇప్పుడిక పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీదే పని చేయాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చక చకా జరిగిపోతున్నాయి. షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కాబట్టి ఆ పని పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి సినిమా అనుకున్న సమయానికే విడుదల అవనుంది. ఈ మేరకు అల్లు అర్జున్ అభిమానులు హాయిగా ఉండచ్చు అని అర్థంఅవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: