ఎఫ్2లో ఇంతేగా.. ఇంతేగా... సరిలేరులో మహేష్ ‘నెవ్వర్ బిఫోర్ఎవర్ ఆఫ్టర్’ ..!
మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ అనే చిత్రం తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో సినిమా తాలూకా అనేక విశేషాలు బయటకొస్తూ అభిమానులలో ఆసక్తి పెంచుతున్నాయి. తాజాగా ఈ మూవీ లో మహేష్ కు ఓ ఊతపదం ఉంటుందని తెలుస్తుంది. అనిల్ ఈ మధ్య తన సినిమాల్లో హీరోల చేత ఓ ఊతపదం పలికిస్తూ వస్తున్నాడు. రవితేజ తో ‘హు..హు..హూ..హూ..’ వెంకీ , వరుణ్ లతో ‘అంతేగా..అంతేగా’ అలాగే మెహ్రీన్‌తో హనీ ఈజ్ ద బెస్ట్ లాంటి క్యాచీ ఊతపదాలు పలికించిన అనిల్..సరిలేరు లో మహేష్ చేత ‘నెవ్వర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్’ అనే టైపులో ఓ ఊతపదం పలికించాడని సమాచారం. మరి ఈ ఊతపదం ఎంత పేలుతుందో చూడాలి. ఇప్పటివరకు వచ్చిన ఊతపదాలన్నీ మంచి హిట్ అయ్యాయి. ఎంత హిట్ అయ్యాయంటే `అంతేగా..అంతేగా` అనే డైలాగ్ వేరే సినిమాల్లో కూడా క్యామియోగా వాడేస్తున్నారు. ఇక టిక్‌టాక్‌లు, ఫేస్‌బుక్‌లు సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.