మహేష్ పార్టీ సాంగ్ న్యూఇయర్ కి దుమ్మురేపుతోంది...

Balachander

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో జోష్ పెరిగిపోతున్నది.  వరసగా సినిమాను ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నది యూనిట్.  ఇప్పటికే వరసగా సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు.  విశాఖ ఉత్సవ్ లో ఈ సినిమాకు సంబంధించి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.  ఈ ప్రోమో అదిరిపోయిందని చెప్పాలి.  మహేష్ బాబు తన స్టెప్స్ తో ఇరగదీసాడు.  


ఎప్పుడు మహేష్ బాబు స్టెప్స్ ఒకేలా ఉంటాయని, పెద్దగా తేడా ఉండదని అంటుంటారు.  ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు తన స్టెప్స్ తో ఫ్యాన్స్ ను ఫుల్ పండగ చేస్తుంటే.. మహేష్ మాత్రం రొటీన్ స్టెప్స్ తో బోర్ కొట్టిస్తున్నారని ఓ టాక్ ఉన్నది.  దాని నుంచి బయటపడేందుకు మహేష్ బాబు కొత్తగా స్టెప్స్ వేయాలని అనుకున్నారు.  


ఇందులో భాగంగానే మహేష్ బాబు డాంగ్ డాంగ్ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాడు.  తన ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు కొత్త స్టెప్స్ వేశారు.  పార్టీ సాంగ్ కావడంతో మంచి ఊపు ఉంటుంది.  పైగా ఇందులో తమన్నా మహేష్ తో కలిసి స్టెప్స్ వేసింది.  సాంగ్ లో ఉన్న జోష్ మహేష్ బాబు స్టెప్స్, బాడీ లాంగ్వేజ్ లో కనిపించడంతో సూపర్ హిట్టు బొమ్మా హిట్టు అంటున్నారు ఫ్యాన్స్.   విశాఖ ఉత్సవ్ లో ప్రోమో రిలీజ్ చేసిన యూనిట్, ఈరోజు పూర్తి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.  


లిరికల్ సాంగ్ తో పాటుగా అందులో కొన్ని కోపోజింగ్ సీన్స్ ను కూడా యాడ్ చేయడంతో సాంగ్ కు సోషల్ మీడియాలో మంచి టాక్ వచ్చింది.  ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నది.  మొత్తం మీద ఇప్పటి వరకు నాలుగు సాంగ్స్ రిలీజ్ చేశారు.  ఇక ఇదిలా ఉంటె జనవరి 5 వ తేదీన భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు.  ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగబోతున్నది.  న్యూఇయర్ కానుకగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో దున్నేస్తోంది.  న్యూఇయర్ రోజున ఈ సాంగ్ ఆడిపోవడం ఖాయం అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: