హెరాల్డ్ 2019 సింహావలోకనం : సిరుల పంట పండించిన టాప్ 3 సినిమాలు !
మహర్షి… సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. మహేష్ కెరీర్లోనే ఇదొక మైల్స్టోన్ అని చెప్పొచ్చు. యాక్షన్, మెసేజ్, ఎమోషన్స్ ఒకటేమిటి ఇలా అన్ని కూడా ఈ మూవీలో సమపాళ్ళులో ఉన్నాయి. ఈ ఏడాది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ‘మహర్షి’ మహేష్‌కు మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది. ఈ చిత్రంలో అల్లరినరేష్, మహేష్ ల మధ్య ఉంటే ఎమోషన్స్ సినిమాలో చాలా బాగా పండాయనే చెప్పాలి. అలాగే పూజా హెగ్డే మహేష్ కాంబినేషన్ కూడా సూపర్బ్ అనిపించుకుంది. మజిలీ… అక్కినేని నాగచైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. వీరిద్దరు పెళ్ళయ్యాక కలిసి నటించిన మొదటి చిత్రం. దివ్యన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. కుటుంబ కథలను రూపొందించడంలో శివ దిట్ట. అతడి గత చిత్రం ‘నిన్ను కోరి’ మాదిరిగానే ఈ మూవీకు కూడా ప్రేక్షకులు నుంచి విశేషదారణ లభించింది. ఇందులో వీరిద్దరి మధ్య ఉండే ఎమోషన్ బాండింగ్ చాలా బాగా కుదిరింది.