కొత్త షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనసూయ..?
అందం అభినయం కలగలిపిన యాంకర్ అనసూయ. ఈ పేరుకు టాలీవుడ్లో భారీగానే క్రేజ్ ఉంది. ఓవైపు బుల్లి తెర పై...మరో వైపు వెండితెరపై నటిస్తూ అదరగొడుతుంది ఈ అమ్మడు. ఇక వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది. జబర్దస్త్ యాంకర్ గా ఈ అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. వరుస ప్రోగ్రాం లతో ఇప్పటికే ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఓవైపు జబర్దస్త్ ప్రోగ్రాం తో పాటు మరోవైపు జీ తెలుగు లోకల్ గ్యాంగ్ అనే షో కూడా చేస్తుంది. ఇంకో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుందని ఈ అమ్మడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మరో ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధమైపోయింది ఈ అమ్మడు. త్వరలో ఈ టీవీ లో రాబోయే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రోగ్రాం లో అనసూయ యాంకర్ గా కనిపించనుంది.
గతంలో ఈటీవీలో స్టార్ మహిళ అనే ప్రోగ్రాం వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నెంబర్వన్ యాంకర్ సుమ యాంకరింగ్ చేసే ఈ షో కోట్ల మంది మహిళలను ఆకర్షించి ఒక రేంజ్ లో హిట్ అయింది. ప్రతి రోజు వచ్చే ఈ షో దాదాపు మూడు వేలకు పైగా ఎపిసోడ్స్ ప్రసారమైంది. తెలుగు బుల్లితెర కు సంబంధించి ఓ రికార్డు సృష్టించినది అనే చెప్పాలి. ఈ షో గత జనవరి 26న ఆగిపోయింది. అయితే ఈ షో ఆగిపోవడంతో మహిళలందరూ కాస్త డిసప్పాయింట్ అయ్యారు కూడా. ఇకపోతే ఈ లోటును భర్తీ చేసేందుకు ఈ టీవీ ఇంకో కొత్త ప్రోగ్రాం ప్లాన్ చేస్తోంది. దీనికి అనసూయ యాంకర్ గా చేస్తోంది. ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ టెలికాస్ట్ టైం ఈటీవీ త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. జనవరి మూడో వారం నుంచి ఈ ప్రోగ్రాం ప్రసారం అయ్యే అవకాశం కనిపిస్తోంది..
ఇకపోతే జబర్దస్త్ లో తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతున్న అనసూయ.. జీ తెలుగు లో ప్రసారమయ్యే లోకల్ గ్యాంగ్ కార్యక్రమంలో కూడా జడ్జిగా ప్రత్యక్షమైంది. అంతే కాకుండా సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ విభిన్నమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. అంతకు ముందుగా జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్ళిపోయి జీ తెలుగులో ఫిక్స్ అయి పోతుంది అని గతంలో కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అనసూయ మాత్రం జబర్దస్త్ కంటిన్యూ చేస్తూనే జీ తెలుగులో కూడా అదరగొడుతోంది. ఇప్పుడు ఈ టీవీ లో మరో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ అవుతుండటంతో అనసూయ ఆ కార్యక్రమంలో ఎలా అదరగొడుతుందో చూడాలి మరి.