మా వార్: గొడవ కట్ చేయండి... మీడియాకు మెగాస్టార్ రిక్వెస్ట్...!
ఈరోజు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. ముందుగా మా డైరీ ఆవిష్కరణ సభకు ప్రత్యేకంగా విచ్చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, మొదటి నుండి మా అసోసియేషన్, నటులకు న్యాయం చేకూర్చే దిశగా ముందుకు నడుస్తోందని, ఇక ఇటీవల కొందరు సీనియర్ నటులకు పెన్షన్స్ వంటివి స్యాంక్షన్ చేయడం మంచి విషయం అని, అలానే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న నటులకు అసోసియేషన్ తరపున ఇల్లు కట్టించే కార్యమం పై కూడా మెగాస్టార్ పొగడ్తలు కురిపించారు. అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో మధ్యలో అక్కడక్కడా అడ్డుపడ్డ హీరో రాజశేఖర్,
ఆ తరువాత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతున్న సమయంలో సడన్ గా స్టేజ్ మీదకు వచ్చి, ఇందాక చిరంజీవిగారు కేవలం మంచిని గురించి మాత్రమే చెప్పారని, అయితే అసోసియేషన్ లో జరుగుతున్న గొడవల గురించి మాత్రం మాట్లాడలేదని, కాగా వాటి వల్లనే తన ఫ్యామిలీ కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని రాజశేఖర్ అన్నారు. దానితో చిరంజీవి సహా మిగాతా సభ్యులందరూ కూడా రాజశేఖర్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసి, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ మొత్తం ఘటనతో కలత చెందిన మెగాస్టార్, కొంత ఉద్వేగభరితంగా మాట్లాడారు. అలానే ఈ విధంగా ఆవేశపూరితంగా మాట్లాడడం వలన మన పరువు మనమే తీసుకున్నట్లు అవుతుందని,
దానివలన అసోసియేషన్ కు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. అలానే ఈ గొడవ కట్ చేసి చూపించండి అప్పుడే మీరు మాకు భుజం కాసినట్టు, మాకు సహాయపడినట్టు అంటూ మీడియాకు విజ్ఞప్తి చేసారు. ఇది కేవలం చిన్న అపశృతని, కావున దీనిని హైలెట్ చేసి మమ్మలను డిప్రెషన్ చేయవద్దని అన్నారు. ఇక్కడ జరిగిన రాజశేఖర్ ఇష్యూను కట్ చేయమని వేడుకుంటున్నాను, దయచేసి మా గుట్టు బయట పెట్టొద్దు, నా తరపున మరోసారి ఇలా జగరకుండా చూస్తానని మాట ఇస్తున్నాను అని అన్నారు......!!