రాజశేఖర్ పై అప్రకటిత బ్యాన్ అంతర్మధనంలో జీవిత !

Seetha Sailaja

‘మా’ సంస్థ డైరీ ఆవిష్కరణ సభలో నిన్న రాజశేఖర్ ప్రవర్తించిన తీరుకు అతడి సన్నిహితులు కూడ ఆశ్చర్య పోతున్నారు. నిన్నటి కార్యక్రమంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజశేఖర్ ఎప్పుడు లేని విధంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముగించి వేదిక పై ఉన్న ఇండస్ట్రీ ప్రముఖుల పాదాలకు ప్రతి ఒక్కరికీ వొంగివొంగి నమస్కారాలు పెట్టడంతో అసలు రాజశేఖర్ ఆరోగ్యం సరిగ్గా ఉందా అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తున్నాయి. 

వాస్తవానికి రాజశేఖర్ చెప్పాలనుకున్న విషయం ఏదైనా కావచ్చు అందుకు ఎంచుకున్న వేదిక సందర్భం ఇది కాదు అంటూ చాలామంది అభిప్రాయ పడుతున్నారు. సాధారణంగా ఇండస్ట్రీ రాజకీయాలను పట్టించుకోని కృష్ణంరాజు లాంటి సీనియర్ నటులు కూడ రాజశేఖర్ కామెంట్స్ విని విస్తుపోయారు. 

‘మా’ సంస్థ రగడను తెలుగు న్యూస్ ఛానల్స్ తో పాటు జాతీయ ఇంగ్లీష్ ఛానల్స్ ప్రసారం చేయడంతో ‘మా’ సంస్థ పరువు బజారుకు ఎక్కింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న తమిళ కన్నడ మళయాళ ఇండస్ట్రీలో కనిపించని రాజకీయాలు మా సంస్థలోనే ఎందుకు ఉన్నాయి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. రాజశేఖర్ తాను చేసిన తప్పును గ్రహించి తన ట్విటర్ ద్వారా క్షమార్పణలు అందర్నీ అడిగినా ఇండస్ట్రీ వర్గాలు నిన్న జరిగిన సంఘటను ఇప్పట్లో మర్చిపోయే ఆస్కారం లేదని అంటున్నారు. 


అంతేకాదు ఇప్పుడిప్పుడే మళ్ళీ అవకాశాలు వస్తున్న రాజశేఖర్ కు నిన్నటి సంఘటనతో ఇక ఎవ్వరు అవకాశాలు ఇవ్వక పోవచ్చని ఒక విధంగా అతడి పై టాలీవుడ్ ఇండస్ట్రీ అప్రకటిత బ్యాన్ పెట్టే అవకాశం ఉంది అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజశేఖర్ కూతుళ్ళు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్న నేపద్యంలో రాజశేఖర్ నిన్నటి ప్రవర్తన అతడి కూతుళ్ళ కెరియర్ కు కూడ ఆటంకంగా మారుతుందని అంటున్నారు. దీనితో ప్రస్తుతం జీవిత అంతర్మధనంలో ఉన్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: