గాల్లో తేలుతున్న హీరో.. వామ్మో నువ్ సూపరెహె..నెటిజన్లు!

siri Madhukar

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు.  అలాంటి వారి సూపర్ స్టార్ కృష్ణ తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు.  అయితే రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత నిర్మాతగా, పద్మాలయ స్టూడియో బాధ్యతల్లో మునిగిపోయారు. ప్రస్తుతం మహేష్ బాబు నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు. ఇక ఇదే ఫ్యామిలీ నుంచి అంటే సూపర్ స్టార్ కృష్ణ చిన్న అల్లుడు సుధీర్ బాబు ‘ఎస్ ఎంఎస్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు.  మొదటి సినిమా యావరేజ్ గా నడిచింది.  మారుతి దర్శకత్వంలో ‘ప్రేమకథాచిత్రమ్’ మంచి హిట్ అయ్యింది.  కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లేకున్నా సుధీరమ్ బాబు కెరీర్ బాగానే సాగుతుంది.  ఆ మద్య బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.. కానీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోయాడు.

 

స్వతగాహాగా బ్యాట్ మెంటన్ క్రీడాకారుడైన సుధీర్ బాబు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ అబ్బుర పరుస్తుంటారు.  ఆ మద్య ఓ వాహనాన్ని నెట్టుకుంటూ తెగ కష్టపడుతున్న వీడియో పోస్ట్ చేశాడు.  తాజాగా  త‌న ట్విట్ట‌ర్‌లో ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో ఆస‌నాలు వేసిన ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోల‌కి ఇందులో ఫోటోషాప్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. న‌న్ను న‌మ్మండి అని కామెంట్ పెట్టాడు.  సాధారణంగా యోగాలో ఇలాంటి విన్యాసాలు కూడా చేయవొచ్చు అని తెలిసిందే.  

 

తాజాగా యోగాలో తాను ఎంత పర్ఫెక్ట్ అన్న విషయం తన అభిమానులకు చేసి మరి చూపిస్తున్నాడు సుధీర్ బాబు.  ఏదేమైన కాళ్ళు ముడిచి చేతుల‌తో దండం పెడుతున్న‌ట్టుగా గాల్లో సుధీర్ బాబు చేస్తున్న విన్యాసాలు ఎంతగానో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అదితి రావు హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: