టాలీవుడ్ గుస‌గుస‌: మెగా మల్టీ స్టారర్‌కు అడ్డు పడింది ఆయనేనా...?

praveen

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది హీరోలు ఏ ఫ్యామిలీ నుండి ఉన్నారు అంటే అందరూ చెప్పే పేరు మెగా ఫ్యామిలీ. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఉన్నంత మంది హీరోలు టాలీవుడ్ లో ఏ  ఫ్యామిలీ నుండి లేరు.మెగా  హీరోలే తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు అని చెప్పవచ్చు.చిన్న  సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు మెగా ఫ్యామిలీ హీరోలే  కనిపిస్తున్నారు. అందుకే ఒక సినిమా కాకపోయినా ఇంకొక సినిమా విడుదలవుతూనే ఉంటుంది తెలుగు ప్రేక్షకులకు అలరిస్తూనే ఉంది. ఇకపోతే ఇప్పుడు వరకు అందరి ఫ్యామిలీ లో నుంచి మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఒక్క మల్టీస్టారర్ సినిమా వచ్చిన దాఖలాలు మాత్రం లేవు. 

 

 మెగా హీరోలు మల్టీస్టారర్ చేస్తే చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల నుంచి ఎప్పుడెప్పుడు మల్టీస్టారర్ వస్తుందా అని తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ సినిమా రాబోతుంది అంటూ  వార్తలు కూడా గతంలో ప్రచురితమయ్యాయి.. అయితే వార్తలు వార్తలు గానే మిగిలిపోయాయి తప్ప సినిమా  మాత్రం కాలేదు. ఈ నేపథ్యంలో అసలు మెగా  మల్టీస్టారర్ కు ఎవరు ఎవరు అడ్డుపడుతున్నారు అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంటుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 


 అలాంటి క్రేజ్ ఉన్న హీరో లతో మల్టీ స్టారర్ చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు ఒక్క మల్టీ-స్టార్రర్  కూడా రాలేదు. దీనంతటి వెనుక సూత్రధారి  మెగాస్టార్ వియ్యంకుడు టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు అని టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2007 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ జల్సా కి ముందే అల్లు అర్జున్ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్టు తెరకెక్కించాలని భావించారు. అందుకే నిర్మాత  సుబ్బిరామిరెడ్డి పట్టుదలగా మెగా  మల్టీ స్టారర్  తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ అల్లు అరవింద్ మాత్రం మెగా మల్టీ స్టారర్ కి  అడ్డుపడి ఆపేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్న మెగా మల్టి స్టారర్  ఎప్పుడు వస్తుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: