టాలీవుడ్ గుసగుస: అభిమానులకి సడెన్ షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్?
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీ౦గా నటిస్తున్నాడు. ఇద్దరి పాత్రల మీద దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక లుక్ త్వరలో విడుదల అయ్యే అవకాశ౦ ఉందని అంటున్నారు. గడ్డంతో పాటు గుండు తో కనపడే అవకాశం ఉందని సమాచారం. ఈ పాత్రను రాజమౌళి ప్రత్యేకంగా తీర్చి దిద్దారని అంటున్నారు. ఈ లుక్ కోసం తారక్ భారీగా బరువు పెరిగాడని కూడా తెలుస్తుంది. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయిందని అందుకే త్వరలో లుక్ విడుదల చేస్తారని అంటున్నారు. అంటే ఒకరకంగా ప్రేక్షకులు ఎన్టీఆర్‌ని లావుగా అంటే మళ్ళీ పాత సినిమాల్లో అంటే సింహాద్రి, అల్లరిరాముడు చిత్రాల్లోలాగా లావుగా కనిపిస్తాడా. ఎలా ఉంటాడో అని ఫ్యాన్స్ చాలా ఎక్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకున్న యంగ్ టైగర్.. మిగిలిన భాషల్లోనూ తన స్టామినాను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడంలో తెరకెక్కుతున్న rrr సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. తారక్‌కు తమిళం, హిందీ భాషలపై మంచి పట్టుంది. ఆ మధ్య కన్నడలోనూ ఓ పాట పాడాడు.