సప్తపది సినిమాను తీసిన విశ్వనాథ్ 70 సంవత్సరాల అన్యోన్య దాంపత్య అనుభవాలు !

Seetha Sailaja

కళాతపస్వి విశ్వనాథ్ తన భార్య జయలక్షి ని పెళ్ళి చేసుకుని 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తమ వైవాహిక సప్తపది కి సంబంధించి ఆయన అనేక విషయాలు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను తీసిన విశ్వనాథ్ కు చెప్పుకోతగ్గ ఆస్థిపాస్తులు లేవు. దీనికి కారణం ఆయన సినిమాలలో చేసిన ప్రయోగాలే కారణం అని చెపుతున్నారు.

తాను తీసిన ‘సిరివెన్నెల’ ‘మాంగల్యానికి మరోముడి’ ‘శంకరాభరణం’ లాంటి ఎన్నో రిస్కీ సినిమాలను తాను తీసానని అలాంటి రిస్కీ సినిమాలు తీయడానికి ముందుకు వచ్చే నిర్మాతలు కరువైన పరిస్థితులలో మంచి పారితోషికాలు ఎవరు ఇస్తారు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నారు. అంతేకాదు తనకు ఇచ్చే పారితోషికం అతి తక్కువ అయినప్పటికీ ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయి అన్న కారణంతో తనకు పారితోషికం ఎగ్గొట్టిన నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు అంటూ విశ్వనాథ్ షాకింగ్ కామెంట్స్ చేసారు.

దీనితో ఇప్పటితరం దర్శకులులా తాను పెద్దగా సంపాదించలేకపోయానని డబ్బు విలువను గుర్తించడంలో ఇప్పటి తరం వ్యక్తులకు ఉన్నంత తెలివితేటలు తనకు లేవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఎన్నో కళాత్మక సినిమాలు తీసిన విశ్వనాథ్ కు తరుచు టీవిలో వచ్చే వంటల కార్యక్రమం చూడటం అంటే చాల ఇష్టం అని చెప్పారు.

వాస్తవానికి ఆవంటలు తిని ఆస్వాదించే శక్తి తనకు లేకపోయినా ఆ వంటల కార్యక్రమాలను చూస్తూ ఆ వంటలను తాను నిజంగానే తిన్నట్లుగా ఫీల్ అయ్యే విచిత్ర అలవాటు విశ్వనాథ్ కు ఉందని ఆయనే స్వయంగా చెప్పారు. తన భోజన ప్రియత్వం గురించి మాట్లాడుతూ మంచి వెరైటీలతో ఉన్న భోజనం ఆశ్వాదించగల దర్శకుడే మంచి సినిమాలను తీయగలుగుతాడనీ ఒక దర్శకుడు వ్యక్తిగత జీవితంలోని అలవాట్లే సినిమాలలో రిఫ్లెక్ట్ అవుతాయి అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నా కేవలం మనుష్యులు సహాయంతోనే నడుస్తున్న విషయాన్ని వివరిస్తూ తనకు ఇంకా చాల వివాహ వార్షికోత్సవాలను చేసుకోవాలని ఉంది అన్న అభిప్రాయాలను షేర్ చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: