కొత్త లుక్ తో అదరగొడుతున్న హాట్ హీరో..

Satvika

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కు యూత్ లో మంచి  ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే..  ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవన్ దర్శకత్వం లో 'వరల్డ్ ఫెమస్ లవర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో రాశి ఖన్నా ,కేథరిన్ ,ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లా  హీరోయిన్లు గా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశ లో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్బం గా ఈ చిత్రం విడుదల కానుంది. 

 

తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదలయింది,. విజయ్ ఏది చేసిన కూడా కాస్త కొత్త గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే  ప్రస్తుతం విజయ్ నటిస్తున్న వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రం నుండి టీజర్ విడుదలయింది. ఈ టీజర్ లో ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్ అంటూ మొదలయిన డైలాగులు యువతను ఆకట్టుకునే లా ఉన్నాయి. 

 

ఇది ఇలా ఉండగా పూరి, విజయ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ మేరకు ఈ చిత్ర టైటిల్ ను ' ఫైటర్'  ఖారారు చేశారు. ఈ సినిమా కథ రెడీ కావడంతో ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా, విజయ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్ కోసం బాలీవుడ్ టాప్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిం పనిచేయబోతున్నారట.. 


ఇకపోతే  పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్ర సన్నివేశాలు అన్నీ ముంబాయిలో చిత్రీకరించనున్నారట.  యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ లుక్ కొత్తగా ఉండబోతుందట. అందుకోసమే సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతుందని  చిత్ర యూనిట్ అంటున్నారు. ప్రస్తుత విజయ్ స్టైలిష్ లుక్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Find Out More:

Related Articles: