రెండు పేజీలు చదవగానే కన్నీళ్లు ఆగలేదు : దీపిక పడుకొన్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కూడా రియలిస్టిక్ కథలనే ఎక్కువగా ఆదరిస్తారు. సినీ రాజకీయ క్రీడా రంగాల ప్రముఖుల జీవిత కథలను సినిమాలుగా తెరకెక్కిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు హీరోలు దర్శకులు. అయితే ఈ క్రమంలోనే ఢిల్లీ ఆసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం చపక్. యాసిడ్ బాధితురాలు లక్ష్మి పాత్రలో దీపికా పదుకొనే నటించింది. అయితే సినిమాలో దీపిక లీడ్ రోల్ ప్లే చేయడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా దీపిక వ్యవవరిస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినది దీపిక. డైరెక్టర్ మేఘన కథ గురించి చెప్పి స్క్రిప్ట్ చదవమంటే రెండు పేజీలు చదవగానే కన్నీళ్లు ఆగలేదు అంటూ దీపిక ఎమోషనల్ అయింది. ఢిల్లీ ఆసిడ్ బాధితురాలు లక్ష్మి జీవితాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు ఈ సినిమా ఒప్పుకున్నట్లు దీపిక చెప్పుకొచ్చారు.
అయితే సినిమా చేయడానికి అంగీకరించిన తర్వాత యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ ను కలిసిన దీపిక... ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తెలుసుకున్నారట. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో చాలా కష్టతరమైన సినిమా చపాక్ అని చెప్పుకొచ్చింది దీపిక. భౌతికంగా మానసికంగా కష్టపడాల్సిన పాత్ర లక్ష్మీ ది అని దీపిక తెలిపింది... యాసిడ్ దాడి బాధితురాలిగ భావోద్వేగాలు పలికించడానికి సవాల్ తీసుకున్నాను అంటూ దీపిక తెలిపారు. ఇక షూటింగ్ సమయంలో దీపిక యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ లాగా కనిపించేందుకు మేకప్ వేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందట. అలాగే మేకప్ తొలగించడానికి కూడా భారీగానే సమయం పట్టిందట
కాగా ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది చిత్ర బృందం. 2020 జనవరి 10న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటించిన దీపికా పదుకొనే... తన కెరీర్లో చెప్పుకోదగ్గ పాత్ర గా ఈ పాత్రని తెలుస్తుందని చెప్పుకొచ్చారు. అటు అభిమానులు కూడా ఇదే భావిస్తున్నారు. ఇక అన్ని ఇండస్ట్రీలో బయోపిక్ లో హవా నడుస్తుంది కాబట్టి దీపికా పదుకొనె నటించిన చపక్ సినిమా కూడా హిట్ అవుతుంది అనడంలో డౌట్ లేదు. అటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.