టెన్షన్ లో కళ్యాణ్ రామ్... ఆ ఇద్దరు హీరోలే కారణం...?

Reddy P Rajasekhar

కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఎంత మంచివాడవురా. ఒక గుజరాతి సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా ఎంత మంచివాడవురా తెరకెక్కింది. సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఇప్పటివరకు భారీగా హైప్ రాలేదు. మరోవైపు సంక్రాంతి పండుగకు సరిలేరు నీకెవ్వరు. అల వైకుంఠపురములో, దర్బార్ లాంటి భారీ సినిమాలు విడుదల కానున్నాయి. 
 
రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా రేపు విడుదల కానుండగా ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే తెలుగు ప్రేక్షకులు పట్టించుకునే అవకాశం ఉంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలపై మాత్రం ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే చాలు కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు విడుదల కానుండడంతో తమ సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు కళ్యాణ్ రామ్ ను టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. 

కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాపై హైప్ క్రియేట్ కాకపోయినప్పటికీ ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత హైప్ పెరిగే అవకాశం ఉందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దర్శకుడు ఈ సినిమాను తెలుగు నేటివిటీకు తగిన విధంగా చాలా మార్పులే చేశాడని సమాచారం. 
 
కానీ కళ్యాణ్ రామ్ ఇలాంటి సినిమాల్లో ఎంతవరకు మెప్పిస్తాడనే ప్రశ్న నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటన ప్రదర్శిస్తే మాత్రమే ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ నటనపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడుతుందని తెలుస్తోంది. కొందరు సినీ విశ్లేషకులు మాత్రం కళ్యాణ్ రామ్ సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: