ముక్కు మూతి కోస్తానన్నా బెదిరేది లేదు ..!

Kunchala Govind

ఈ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అవుతోంది. తను ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనం అవుతోంది. పబ్లిక్  ఫంక్షన్  మాత్రమే కాదు, ఏదైనా షో కెళ్ళినా, సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళిన ఎవరి విషయంలోనైనా స్పందించినా దీపికనే రౌండప్ అవుతోంది. అది తన బ్యాడ్ టైమా లేక ఇది పబ్లిసిటీకి ఏమైనా ఉపయోగపడుతుందా తెలీదు గానీ దీపిక మాత్రం జనాలతో బాగా ట్రోల్ అవుతోంది. ఇక తను కథానాయికగా నటించిన 'పద్మావత్ 3డి' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ ముందు వివాదాలు కరుడుగట్టిన హిందూవాదులతో ఎదురైన సమస్యల లిస్ట్ చాలా పెద్దదే. సంజయ్ లీలా భన్సాలీపై దాడులకు పాల్పడిన రాజ్ పుత్ మూకలు .. ఆ తర్వాత దీపిక ముక్కు కోసేస్తామంటూ వార్నింగులు ఇచ్చారు. అయితే అన్ని వివాదాల మధ్య రిలీజైనా పద్మావత్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 

 

ఇప్పుడు ఆ స్థాయి సినిమా కాకపోయినా చపాక్ విషయం లోనూ దీపిక కు కొన్ని చిక్కులు వచ్చిపడుతున్నాయి. అయితే సినిమా కంటెంట్ విషయంలో అభ్యంతరాలు కావు. ఇది దీపిక వ్యక్తిగత వ్యవహారికం నచ్చలేదు అంటూ జేఎన్.యు విద్యార్థుల్లో ఒక వర్గం హెచ్చరిస్తోంది. జేఎన్.యు దాడుల్ని ఖండించిన దీపికను శత్రువులా చూస్తుండడం తెలిసిందే. ఇదే ఇప్పుడు దీపికకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడికెళ్ళినా ఆ  విషయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

 

ఆ వివాదంతో ముడిపెడుతూ తాజాగా రిలీజైన చపాక్ మూవీని బాయ్ కాట్ చేస్తామని దుండగులు బెదిరిస్తున్నారు. అలాగే ఆన్ లైన్ లో బుక్ చేసిన టిక్కెట్లను క్యాన్సిల్ చేస్తున్నాం అంటూ బెదిరిస్తూ .. ఓ టికెట్ (ముగ్గురికి బుక్ చేసినది) స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టారు. సేమ్ టైమ్ సేమ్ ప్లేస్ సేమ్ థియేటర్ టిక్కెట్లు మూడు చోట్ల నుంచి పోస్ట్ అవ్వడం క్లియర్ గా తెలిసిపోయింది. ఒకే స్క్రీన్ షాట్ ను గుజరాత్ లోని మూడు చోట్ల నుంచి పోస్ట్ చేయడం తో అది ఫేక్ అని తేలిపోయింది. కోపంలో బెదిరించేందుకు ఎంచుకున్న ప్లాన్ అని అర్థమైపోయింది. అయితే ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేసే తరహా కాదు దీపిక. ప్రస్తుతానికి తాను నటిస్తూ నిర్మించిన చపాక్ ప్రచారం పైనే దీపిక ఫోకస్ చేస్తోంది. అంతేకాదు గతంలో మాదిరిగా ముక్కు కోస్తామన్నా మూతి కోస్తామన్నా నేను మీలాంటి వాళ్ళకి రవ్వంత కూడా బెదిరే మనిషిని కాదంటు సవాల్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: