ప్రభాస్ సినిమా టైటిల్ మార్చనున్న చిత్రయూనిట్
ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయిన ఈ టైటిల్‌తో వెళితే సినీ అభిమానుల్లో అంత హైప్ క్రియేట్ అవదని చిత్ర యూనిట్ భావించిందట.అంతే కాదు మరిన్ని అంచనాలు ఈ సినిమాపై అభిమానుల్లో పెంచడానికి మరో డిఫరెంట్ టైటిల్ కోసం కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టిందట. ఇందుకోసం ప్రభాస్ అభిమానుల నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకోనుందని సమాచారం.
అయితే ప్రభాస్ కొత్త సినిమా పేరు ‘జాన్’ కాదని తెలియడంతో దిల్ రాజు తన సినిమా విషయంలో నిర్భయంగా ముందడుగేశాడు. తమిళ సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘96’ను దిల్ రాజు తెలుగులో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రం ప్రారంభం నుంచి తన చిత్రానికి ‘జాను’అనే టైటిల్‌ను పెట్టాలని ఆలోచించాడట. కానీ ప్రభాస్ ‘జాన్’ తో దగ్గరి పోలికలు ఉండటంతో ఈ అగ్ర నిర్మాత కాస్త తటపటాయించాడట. అందుకే నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా చిత్ర టైటిల్‌ను డిసైడ్ చేయలేకపోయాడు దిల్ రాజు. తాజాగా అతడికి అందిన సమాచారం ప్రకారం రాధాకృష్ణ టీం ఆ టైటిల్‌ను వదులుకున్నట్లు తెలియడంతో వెంటనే తన చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ ఫిక్స్ చేసి వెంటనే ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేసినట్లు సమాచారం.