అల వైకుంఠపురములో : "అల హిట్" ఏ అభిమానులు పండగ చేసుకోవాలి...??????
ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గత సినిమా పీడకలగా మారింది. అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కావడమే కాకుండా కాపీ చేశారన్న బ్యాడ్ నేమ్ కూడా తెచ్చింది. ఆయనకు ఇప్పుడు హిట్ అత్యవసరం. మరి అలాంటి పరిస్థితుల్లో సూపర్ హిట్ వచ్చినందుకు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకోవచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో బన్నీ ఎన్టీఆర్, పవన్, మహేష్‌బాబు సినిమాల్లో పాటలకు కూడా డ్యాన్స్ చేసి ఆ హీరోల అభిమానులను కూడా ఖుషీ చేశాడు. అందుకే ఆ హీరోల ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకోవచ్చు. ఇక సంక్రాంతికి అందమైన కుటుంబ కథా చిత్రం వచ్చింది కాబట్టి ప్రతి తెలుగు సినిమా అభిమాని చూసి పండగ చేసుకోవచ్చు. అటు ట్రేడ్ వర్గాలు, ఇటు నిర్మాతలు, హీరో, హీరోయిన్, దర్శకుడు కూడా హిట్ వచ్చినందుకు పండగ చేసుకోవచ్చు.