విక్టరీ వెంకటేశ్ ,యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ వెంకి మామ. మంచి అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకున్నా టాక్ బాగుండడంతో ప్రపంచ వ్యాప్తంగా 40కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ఈ చిత్రం విడుదలైన నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది.
నిజానికి ఒప్పదం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారం లో వెంకి మామ ను విడుదలచేయాల్సి ఉండగా సంక్రాంతి హడావిడి లో సైలెంట్ గా నిన్న నే ప్రైమ్ , డిజిటల్ లోకి రిలీజ్ చేసింది. బాబీ డైరెక్షన్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ నటించగా నాగ చైతన్య కు జోడిగా రాశీ ఖన్నానటించింది.
ఇక ఈ చిత్రం తో వెంకీ , చైతన్య గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టారు. అందులో భాగంగా పోయిన సంక్రాంతికి వెంకీ ,ఎఫ్ 2 తో ప్రేక్షకులముందుకు రాగ ఆ చిత్రం ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా గా నిలువగా సమ్మర్ లో మజిలీ తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నాగ చైతన్య. ఇక ప్రస్తుతం చైతన్య , శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తన 19వ చిత్రంలో నటిస్తుండగా వెంకీ, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో అసురన్ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ అనంతపురంలో ప్రారంభం కానుంది.