అలా ఫ్లాప్ అయ్యాడు.. ఇలా సక్సెస్ అయ్యాడు..

siri Madhukar

సాధారణంగా జీవితంలో ఒకటి పోయినా.. మరొకటి దక్కుతుంది... కాకపోతే అదృష్టం కలిసి రావాలి అంటారు.  అలా సినీ పరిశ్రమంలో ఎంతో మంది సక్సెస్ సాధించడానికి నానా తంటాలు పడుతుంటారు..కొన్నింట సక్సెస్ సాధించినా మరికొన్ని విషయాల్లో దారుణంగా విఫలం అవుతుంటారు.  సినీ పరిశ్రమ అంటేనే ఓ మాయ..అలాంటి మాయలో ఇలాంటి సహజం అనుకునే వారు చాలా మంది ఉంటారు.  స్టార్ హీరోల వారసులు హీరోలుగా వచ్చి సక్సెస్ సాధించిన వారు చాలా అరుదు.. స్టార్ డైరెక్టర్ల వారసులుగా వచ్చి ఒక్క హిట్ కూడా ఖాతాలో వేసుకోలేని వారు కొందరు..ఇలా టెక్నికల్ విభాగంలో కూడా ఎంతో మంది సమర్థవంతమైన ప్రతిభ చూపించుకోలేక ఫెయిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. 

 

తాజాగా డైరెక్టర్ గా పలు సినిమాలు తీసి వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న సమయంలో డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తి లాభాల బాటపట్టి సంతోషంలో ఉన్నారు ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్. తాజాగా ఈయన మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్ర గుంటూరు రైట్స్ దక్కించుకున్నాడు. అక్కడ కేవలం అడ్వాన్సుల రూపంలోనే పెట్టుబడి వెనక్కి వచ్చేసిందట.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మంచి సక్సెస్ టాక్ తెచ్చుకోవడం..కలెక్షన్లు కూడా బాగానే రాబట్టడం జరుగుతుంది. 

 

ఈ మూవీలో పదమూడేళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి మరో ప్రత్యేకత. దేవీ మ్యూజిక్ మాస్ సాంగ్స్ మొత్తానికి ఈ మూవీ సక్సెస్ కి అన్నీ కలిసి వచ్చాయి. మెహర్ రమేష్ డిస్ట్రిబ్యూటర్ గా గుంటూరు రైట్స్ దక్కించుకున్నాడు.  ఈ సినిమా పాజిటీవ్ టాక్ రావడం.. వరుసగా సెలవులు ఉండటం పైగా రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతుండడం తో మనోడికి భారీ స్థాయిలో లాభాలు రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. తెలుగులో ‘దేశముదురు’, ‘పోకిరి’ వంటి మూవీస్ కి స్క్రిప్ట్ విభాగంలో పనిచేశారు. తర్వాత  ‘కంత్రీ’, ‘శక్తి’, ‘షాడో’ సినిమాలకు దర్శకత్వ వహించగా వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు డిస్ట్రబ్యూటర్ గా సక్సెస్ అయ్యాడు.. మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్తాడా.. ఇదే బెటర్ అనుకుంటారా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: