ఆర్ ఆర్ ఆర్‌లో ఈగ విల‌న్... ఈ పాత్ర‌లో న‌టిస్తున్నాడా?

Arshu
బాహుబ‌లి త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి మొద‌టి నుంచి కూడా ఎంత హైప్ ఉందో ప్ర‌త్యేకించి చ‌ప్ప‌క్క‌ర్లేదు. అలాగే ప్ర‌మోష‌న్స్ విష‌యంలో కూడా రాజ‌మౌళి రూటే కాస్త సెప‌రేట్‌గా ఉంటుంది. త‌ను చేసే ఏ చిత్ర‌మైనా స‌రే ఒక డిఫ‌రెంట్ వేలో ప్ర‌మోష‌న్స్‌ని అందిస్తాడు. ఇద్ద‌రు టాప్ స్టార్ల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. 

టాలీవుడ్‌లోనే టాప్ స్టార్లు కావ‌డంతో అంద‌రి చూపు ఈ చిత్రం వైపే ఉంది. ఎప్పుడెప్పుడు ఏ అప్‌డేట్ వ‌స్తుందా అని ఎంతో  ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో క‌న్న‌డ స్టార్ సుదీప్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న ఈ చిత్రంలో న‌టించే పాత్ర గురించి సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుంది. ఈ చిత్రంలో స‌దీప్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నార‌ట‌. గ‌తంలో కూడా సుదీప్ రాజ‌మౌళి చిత్రంలో న‌టించారు. రాజ‌మౌళి `ఈగ‌` చిత్రంలో ఈగ‌కు భ‌య‌ప‌డే  ఓ విల‌న్ క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టారు.  అలాగే బాహుబ‌లి చిత్రంలో కూడా న‌టించారు. తిరిగి ఇప్పుడు మ‌ళ్ళీ ఈ చిత్రంలో ఆయ‌న రాజ‌మౌళితో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల్లో కూడా సుదీప్ కి మంచి ఫాలోయింగ్ ఉంద‌నే చెప్పాలి.

ఇటీవ‌లె ఆయ‌న `సైరా` చిత్రంలో కూడా న‌టించారు. అందులో మెగా హీరోకి విల‌న్‌గా క‌నిపిస్తూనే చివ‌ర్లో ఆయ‌న హీరోయిజం ని చూపిస్తారు. అందులో ఆయ‌న న‌ట‌న‌కు ప్ర‌త్యేక పశంస‌లు అందుకున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే సైరా సుదీప్ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచార‌నే చెప్పాలి. ఇక ఈ ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని 350కోట్ల బ‌డ్జెట్‌తో దాన‌య్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభ‌ట్, హాలీవుడ్ న‌టి ఒలివియా మెరిస్ ఇందులో న‌టిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: