వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ ప్రాక్టీస్ కి ప్రిపేరవుతున్నాడు. జనవరి 19న వరుణ్ తేజ్ బర్త్‌డే సందర్బంగా టైటిల్ లోగోతో పాటు వరుణ్ తీక్షణమైన ప్రాక్టీస్ లుక్‌తో ఓ పోస్టర్‌ను డిజైన్ చేసి రిలీజ్ చేశారు ఫ్యాన్స్. ఈ పోస్టర్లో బాక్సింగ్ సాధన చేస్తున్న వరుణ్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే లుక్ మార్చిన వరుణ్ బాక్సింగ్ ప్రాక్టిస్ చేయటంతో పాటు ఫిట్నెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వరుణ్ తేజ్.
ఈ సినిమా కోసం వరుణ్ ఎంత కష్టపడుతున్నాడో ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సింగ్‌లో మరింత నైపుణ్యం కోసం వరుణ్ ముంబై వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయత్ పర్యవేక్షణలో వరుణ్ బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నారు. మరి ఈ బాక్సర్ తెరమీద ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి. ఇంకా ఈ చిత్రంలో కాస్ట్ అండ్ క్రూ గురించి వివరాలన్నీ తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే...వరుణ్ హైట్ పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్ సరిపోయినట్లు కనిపిస్తుంది. లుక్ పరంగా వరుణ్ తన పాత్రకు న్యాయం చేస్తాడు అనిపిస్తుంది.
ఇక ఇటీవలె విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ నెగిటివ్ క్యారెక్టర్లో ఫ్యాన్స్‌ను అలరించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆ చిత్రంలోని ఓ పాత పాట శోభన్‌బాబు, శ్రీదేవి నటించిన బిందెల సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆ పాట అప్పట్లో ఎంత హిట్ అయిందో ఇప్పుడు కూడా అంతే హిట్‌ను కొట్టింది. సాధారణంగా హీరోలు నెగిటివ్ క్యారెక్టర్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ వరుణ్ ఒక్కో చిత్రానికి ఒక్కో రకమైన వేరియేషన్ చూపిస్తూ తన నటనలోని ప్రతిభను బయటకు తీసుకువస్తాడు. ఆయన ఎన్నుకునే కథలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: