ఉదయ్ మరణం గురించి అతనెందుకు నోరుతెరవలేదు..?

shami
టాలీవుడ్ లో లవర్ బోయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని కొద్దికాలంగా సినిమాలు లేక బాధపడుతున్న ఉదయ్ కిరణ్ రీసెంట్ గా ఆత్మ హత్య చేసుకుని చనిపోయిన సంగతి అందరికి తెలిసిందే ఇండస్ట్రీ ని అంతగా కదిలించిన ఈ దారుణంతో టాలీవుడ్ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలు తెలిపారు. ఇక ఉదయ్ తో ఒక్క సినిమా తీసిన డైరక్టర్ కూడా ఉదయ్ కి నివాళి అర్పించారు. కానీ ఉదయ్ కిరణ్ తో ఒక సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత కూడా రెండు సినిమాలకు డైరక్ట్ చేసిన ఒక డైరక్టర్ మాత్రం అసలు ఏం స్పందించలేదు. ఆ డైరక్టర్ ఎవరనే కద మీ డౌట్ ఆయనే వి.యన్.ఆదిత్య. ఉదయ్ కి చిత్రం,నువ్వు నేను సినిమాలు ఇచ్చిన క్రేజ్ కన్నా మనసంతా నువ్వే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి పెద్ద సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఆడింది. మనసంతా నువ్వే సినిమా వి.యన్.ఆదిత్యాది మొదటి సినిమా సో తన మొదటి సినిమా హీరో ఉదయ్ కిరణ్.. మరి ఆ రేంజ్ హిట్ ఇచ్చిన హీరో చనిపోయాడని తెలిసినా ఎందుకు ఆదిత్య ఉదయ్ పార్థివ దేహాన్ని చూడడానికి రాలేదు. ఒకవేళ ఉదయ్ ఆదిత్యాలు మాట్లాడటం మానేశారా..? వీరిద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా..? అని కూపీ లాగుతున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఏది ఏమైనా అత్యంత దారుణంగా మనసుకి సమాధానం చెప్పుకోలేక ఆత్మ హత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీ మొత్తం అనుకుంది. తన మొదటి సినిమాలో హీరో చనిపోయాడని తెలిసినా కనీసం చూడ్డానికి కూడా రాలేదంటే ఏదో జరిగే ఉండొచ్చు అని అనుకుంటున్నారు సినీ విమర్శకులు. సో ఇప్పటికైనా ఆదిత్య నోరుతెరిస్తే మంచిది లేకపోతే వారు డౌట్ పడ్డట్లే ఉదయ్ తో ఏమన్నా గొడవలున్నాయేమో అని అందరు నమ్ముతారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: