గత ఏడాది ప్రారంభం లో ఎఫ్ 2 తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఆ తరువాత చివర్లో వెంకీ మామ తో సూపర్ హిట్ కొట్టి వరస విజయాలతో ఫుల్ ఫామ్ లో వున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ అనంతపురం లో జరుగుతుంది. దాదాపు 30రోజల పాటు జరుగునున్న ఈ షెడ్యూల్ తో సగానికి పై గా సినిమా పూర్తి కానుంది.
ఇక తాజాగా ఈ చిత్రం యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదలచేశారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నారప్ప అనే టైటిల్ ను పెట్టారు. అలాగే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లలో మాస్ లుక్ లో వెంకీ అదరగొట్టాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈచిత్రం లో వెంకీ కి జోడీగా ప్రియమణి నటిస్తుంది.
ప్రముఖ తమిళ నిర్మాత కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఒరిజినల్ వెర్షన్, అసురన్ లో ధనుష్ , మలయాళ నటి మంజూ వారియర్ లీడ్ రోల్స్ లో నటించగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 70గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. జాతీయ అవార్డు గ్రహీత వెట్రి మారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మరి తెలుగు రీమేక్ నారప్ప ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.