‘లింగా’ నుంచి బతికిపోయిన రజినీ..!
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ‘లింగా’. 2014లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఒక పాత్రకు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. మరో పాత్రకు అందాల తార అనుష్క నటించారు. ఈ మూవీ కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. బయ్యర్లు భారీగా నష్టపోవడంతో వారితో రజినీ మాట్లాడి సెటిల్ మెంట్ చేసినట్లు టాక్. కెరీర్ పరంగానే కాదు రజినీకాంత్ ఈ మూవీ వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురుయ్యాయి. ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఎన్నో టెన్షన్లు నెలకొంటున్నాయి. ముఖ్యంగా చిత్రం కథల విషయంలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
అచ్చం ఇలాంటి ఇబ్బందే ‘లింగా’ మూవీకి ఎదురైంది. ఈ చిత్రం విడుదల సమయంలో స్టోరీ కాపీ కొట్టారంటూ డైరెక్టర్ రవిరత్నం మధురై కోర్టులో కేసు వేశారు. కథను తన ‘ముల్లై వానమ్ 999’ సినిమా నుండి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో ఈ కేసు చాలానే దుమారం రేపింది. కోర్టు రూ.10 కోట్ల ఇన్సూరెన్స్ మీద చిత్రం విడుదలకు అనుమతించింది. కాగా, ఈ చిత్రం రగడ కొంత కాలంగా కోర్టులో కొనసాగుతూ వస్తూనే ఉంది.
ఇన్నాళ్ళు విచారణలో ఉన్న ఈ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కథ కాపీ కాదని తీర్పును వెలువరించింది. దీంతో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ సంక్రాంతి కానుకగా మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీ మంచి సక్సెస్ సాధించి ఇటీవల రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.