ఆలీ అదృష్టం మామూలుగా లేదుగా..?
సీతాకోకచిలుక సినిమాతో బాల నటుడి గా తెలుగు తెరకు పరిచయమైన ఆలీ తర్వాత టాప్ కమెడియన్ గా ఎదిగారు. కేవలం కమీడియన్ కాకుండా హీరో కూడా నటించాడు. ఆలీ హీరోగా నటిస్తూనే కమెడియన్ గా నటిస్తూ తన సత్తా చాటాడు. గత కొంతకాలంగా వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకున్నాడు. అప్పుడప్పుడు టాలీవుడ్ ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కమెడియన్ టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన ఆలీ ఇటీవల ఏపీలో ఎన్నికల సమయంలో వైఎస్సార్ సిపి లో చేరారు. అయితే రాజకీయాల్లో చేరిన తర్వాత సినిమాల్లో నటించడం తక్కువ చేశారు.
కాకపోతే బుల్లి తెరపై మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా అలీ కి మరో అదృష్టం కలిసివచ్చింది. తనదైన పంచ్ కామెడీ తో అలరిస్తున్న ఆలీ బాలీవుడ్ మూవీ లో కూడా నటించారు. తాజాగా పలికి హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం దక్కింది. జగదీష్ దానేటి దర్శకత్వంలో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఈ హాలీవుడ్ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిలిమ్స్, పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తాయి. ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి విషయమై కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్‌ను కలిశారు అలీ, దర్శకుడు జగదీష్. తాజాగా ఆలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హాలీవుడ్ సినిమా చేయడం చాలా సంతోషంగా, ఎగ్జయిటింగ్‌గా ఉంది.
హలీవుడ్ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు,హిందీ సినిమాల్లో నటించిన తనకు ఒక్కసారే హలీవుడ్ లో ఛాన్స్ వచ్చిందంటే మొదట నమ్మలేక పోయాను. హాలీవుడ్ లో నటించడం ఒక అదృష్టం అనే చెప్పొచ్చు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ.. సినిమా అంటే తనకు ప్రాణం అని అన్నారు. తాజాగా ఆలీకి హాలీవుడ్ లో ఛాన్ప్ వచ్చందన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.