టక్ జగదీష్ ఆ సినిమాకు ఫ్రీమేకా..?

shami

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టక్ జగదీష్. నిన్ను కోరితో హిట్ అందుకున్న ఈ హీరో డైరక్టర్ కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తున్న ఈ టక్ జగదీష్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కథ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా బలరామకృష్ణులు సినిమా కథను పోలి ఉంటుందని అంటున్నారు. శోభన్ బాబు, రాజశేఖర్, జగపతి బాబు కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ బలరామకృష్ణులు.

 

నానితో శివ నిర్వాణ చేస్తున్న ఈ సినిమా కథ ఈ సినిమాను పోలి ఉంటుందట. నానితో పాటుగా జగపతి బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ నిన్ను కోరితో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్వాణ లాస్ట్ ఇయర్ మజిలీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. నాగ చైతన్య, సమంత కలిసి నటించిన మజిలీ సినిమా చైతు కెరియర్ లో ది బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ డైరక్టర్ 3వ సినిమాగా టక్ జగదీష్ చేస్తున్నాడు. 

 

ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రాధాన్యతతో తెరకెక్కిస్తున్నాడట. ఆల్రెడీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో చేసిన నిన్ను కోరి.. హీరో హీరోయిన్ పెళ్లి తర్వాత జరిగే కథతో మజిలీ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా తీసి ప్రేక్షకుల ఆమోదం పొందిన శివ ఈసారి టక్ జగదీష్ చేసే పనులతో ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నాని సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం నాని వి సినిమా చేస్తున్నాడు. నాని టక్ జగదీష్ సినిమా జూలైలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: