ఒక త్రివిక్రం.. మూడు మెగా ప్రాజెక్టులు.. వారెవా గురూజీ..!

shami

మాటల మాత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ హిట్టు కొడితే ఎలా ఉంటుందో రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్.. నాన్ బాహుబలి రికార్డులను సైతం క్రియేట్ చేస్తూ ఇప్పటికి వసూళ్ల బీభత్సం సృష్టిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. కరెక్ట్ టైం కు కరెక్ట్ సినిమా పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాతో త్రివిక్రం మళ్లీ సూపర్ ఫాం లోకి వచ్చేసినట్టే. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవగా ఆ తర్వాత చేసిన అరవింద సమేత యావరేజ్ అనిపించుకుంది.

 

అల వైకుంఠపురములో ఇంత పెద్ద హిట్ అవుతుందని చిత్రయూనిట్ కూడా ఊహించలేదట. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ మరోసారి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుందట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్మ్ రాం చరణ్ తో ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో పాటుగా పవన్ కళ్యాణ్ నిర్మిస్తారని అంటున్నారు.

 

రాం చరణ్ తో సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రం సినిమా ఉంటుందట. ఆ సినిమా మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇక దాని తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తో త్రివిక్రం సినిమా ఉంటుందని అంటున్నారు. అంటే తారక్ సినిమా తర్వాత వరుసగా మూడు ప్రాకెటులు మెగా హీరోలతోనే చేస్తున్నాడు. సో ఈ లెక్కన త్రివిక్రం దాదాపు మూడు నాలుగెళ్ల వరకు బిజీ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ కు మాత్రం  ఇది పండుగ లాంటి వార్తే.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: