నేచురల్ స్టార్ నాని , సక్సెఫుల్ యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండవ చిత్రం టక్ జగదీశ్ ఈ రోజు అధికారికంగా లాంచ్ అయ్యింది. ఫిబ్రవరి 11నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈచిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ ,తమిళ నటి ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై మజిలీ నిర్మాతలు సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్నఈచిత్రం జులై లో విడుదలకానుంది. ఇక శివ నిర్వాణ -నాని కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్ కావడంతో టక్ జగదీష్ పై మంచి అంచనాలు వున్నాయి.
ఇక ఈ సినిమా కన్నా ముందు నాని వి తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో హీరోగా
నటించగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నాని విలన్ గా కనిపించనున్నాడు. కొద్దీ రోజుల క్రితం ఈ చిత్రం నుండి సుధీర్ బాబు , నాని ఫస్ట్ లుక్ లు విడుదలకాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నివేధ థామస్ , అధితి రావ్ హైదరి కథానాయికలు నటించగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ చిత్రం విడుదలకానుంది. నానికి ఇది 25వ చిత్రం. ఇదిలావుంటే గత ఏడాది నాని, జెర్సీ , గ్యాంగ్ లీడర్ తో ప్రేక్షకులముందుకు రాగ అందులో జెర్సీ సూపర్ హిట్ అయ్యింది. గ్యాంగ్ లీడర్ మాత్రం నిరాశపరించింది దాంతో నాని ఈ వి పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.