వామ్మో ఏకంగా బెడ్‌పైనే కమిట్మెంట్ అంటున్న హీరోయిన్.. ఇదెక్కడి అరాచకం... !
కమిట్మెంట్ అంటే అప్పచెప్పిన పనిని అంకిత భావంతో పూర్తిచేయడం. ఒకరికి ఏదైన విషయంలో కమిట్మెంట్ ఇచ్చామంటే ఆ పనిని మరచిపోకుండా ముగించడం. ఈ కమిట్మెంట్ అనే పదం మీద ఎంత విలువ ఉండేదో ఒకప్పుడు... కానీ ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని పడకగది సుఖం కోసం ఉపయోగించడం వల్ల ఇప్పుడు కమిట్మెంట్ అనే వాఖ్యాలకు కూడా ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇదంతా సినిమా ఇండస్ట్రీ పుణ్యాన డిక్షనరీలో అర్దమే మారిపోయింది.
ఇకపోతే సామాన్యంగా బయట ఉన్న వారికి కమిట్మెంట్ అంటే పూర్తిగా శృంగార భాషలోకి వెళ్లరు. కానీ చిత్రపరిశ్రమతో పరిచయం ఉన్నవాళ్లకు మాత్రం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నటీమణులు ఈ మాట గురించి అనేక సందర్భాల్లో చెప్పారు... అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ కమిట్మెంట్ అనే మాటే టైటిల్‌గా మారి ఓ వెబ్ సిరీస్ రూపొందుతుంది.. అసలే సినిమాల్లో వకాశాలు రాక కొందరు హీరోయిన్స్, అందాల ఆరబోతకు తెరతీస్తున్నారు.
ఇలాంటి వారి అందాలను ఆస్వాధించడానికి ఎప్పటికప్పుడు కొందరు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి పరిస్దితుల్లో అసలు సెన్సార్ అనేది లేకుండా ఉన్న కొన్ని వెబ్‌సిరీస్‌లు ఈ మధ్యకాలంలో రెచ్చిపోతున్నాయి. ఇక ఇందులో విలువలను చూపించే వారుంటే, అసలు ఒంటిమీది వస్త్రాలే జారుతున్న పట్టించుకోకుండా అందాలు ఆరబోస్తున్న అతివలు కూడా ఉన్నారు. ఇప్పుడంతా వెబ్‌సిరీస్‌ల మయంగా మారుతుంది. ఇకపోతే తాజాగా బిగ్‌బాస్ రెండవ సీజన్లలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన హీరోయిన్, నటి తేజస్వీ కూడా ఓ వెబ్‌సిరీస్‌కు కమిట్మెంట్ ఇచ్చిందట..
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తేజస్వీకి బుల్లితెరపై అనేక అవకాశాలు వచ్చాయి. అయితే అంతగా తన కెరీర్‌ని బూస్ట్ అప్ చెయ్యడానికి ఉపయోగపడలేదు. ఈ క్రమంలోనే ఈ అమ్మడు.. వెబ్‌సిరీస్‌లను చెయ్యాలని ఫిక్స్ అయ్యిందని సమాచారం.. అసలే లేలేత పరువాలతో తొణికిసలాడుతున్న తేజస్వీ, అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడదు... అలాంటిది కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్‌తో ముందుకు వస్తుంది అంటే అందులో ఏమాత్రం ఊరిస్తుందో అని అనుకుంటున్నారట.
అంతే కాకుండా లేటెస్ట్గా రిలీజ్ అయిన పోస్టర్‌ను చూస్తే పడక గదిలో మనుషులు కనపడకుండా దుప్పటి కప్పుకుని కాళ్లు మాత్రమే కనిపించే విధంగా శృంగార ప్రేరేపితంగా ఉన్న ఈ సీన్ కుర్రకారుని కునుకులేకుండా చేస్తుందనుకుంటున్నారు..