ఏంటి టైటిల్ చూసి రెహమాన్ ఏ హైవే మీద సాంగ్ పాడాడు.. అది ఏమన్నా ఈవెంట్ కి పాడాడా..అని రకరకాల క్వశ్చన్స్ మీ మదిలో తడుతున్నాయి కావొచ్చు కాని ఇక్కడ విషయం అది కాదులేండి. మన మ్యూజిక్ మిరకిల్.. డబుల్ ఆస్కార్ గ్రహిత ఏ.ఆర్.రెహమాన్ హైవే సినిమాలో ఒక సాంగ్ పాడాడట. కథలో అంతర్లీనం గా సాగే ఆటలు పాడటం లో రెహమాన్ తనకు తానే సాటి.. అలానే ఈ సినిమాలో కూడా మహి వే అనే సాంగ్ ని పాడాడట.
కథ లోని విషయాన్ని రెహమాన్ చాలా అద్భుతంగా పాడాడని ఆ సినిమా డైరక్టర్ ఇంతియాజ్ ఆలి అన్నారు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఇండెప్త్ థీం సాంగ్ ఒకటి కథలో చాలా ఇంపార్టెంట్ అట.. ఆ సాంగ్ ని కంపోజ్ చేసిన రెహమాన్ దానికి తన గొంతునే సరి చేసుకుని పాడేశాడట. రణదీప్ హుడా , అలియాభట్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న హైవే సినిమాను సాజిద్ నదియావాలా.. ఇంతియాజ్ అలి కలిసి నిర్మిస్తున్నారు.
40 క్రోర్స్ బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ సినిమా విండోస్ సిట్ ఫిలింస్ సమర్పిస్తుంది.. ఈ సినిమా యూటీవి మోషన్ పిక్చర్స్ ఫిబ్రవరి 21 న రిలీజ్ చేస్తుంది. సో మొత్తానికి మ్యూజిక్ తోనే ప్రేక్షకులను ఊర్రూతలూగించేలా చేసే రెహమాన్ . హైవె సినిమాలో థీం సాంగ్ పాడాడంటే ఇక ఆ సినిమా మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు.. రెహమాన్ పాటకు మంచిగా పిక్చ్యరైజేషన్ కూడా చేశాడట డైరక్టర్ ఆలి. సో బాలీవుడ్ ఆడియెన్స్ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: