ఆ విషయంలో మిమ్మల్ని బీట్ చేసే టాలీవుడ్ స్టార్ ఇంకొకరు లేరు మహేష్ జీ.....!!

GVK Writings

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, అలానే సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు హిట్స్ అందుకుని హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్నారు. మహేష్ బాబు తొలిసారిగా ఒక ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో సూపర్ స్టార్ మహేష్ విపరీతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిన మహేష్, 

 

వాస్తవానికి ప్రతి ఏడాది కూడా కొద్దిరోజుల పాటు తన ఫ్యామిలీతో కలిసి ఈ విధంగా విహార యాత్రలకు వెళ్తుంటారు. నిజానికి అటు సినిమాలతో పాటు ఇటు ఫ్యామిలీకి కూడా సమానంగా ప్రాధాన్యతనిచ్చే మహేష్ బాబు, తనకు వీలు దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో సరదాగా గడపడం ఇష్టం అని చెప్తుంటారు. ఇక ఎక్కువగా ఖాళీ దొరికినపుడు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇష్టపడే మహేష్ బాబు, తన ఫ్యామిలి తో ఎంతో సంతోషంగా గడపడమే తన హెల్త్ సీక్రెట్ అని చెప్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా తన భార్య నమ్రత, పిల్ల విషయంలో అన్ని విధాలుగా శ్రద్ధ తీసుకుని తనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకుంటూ ఉంటుందని, 

 

అందుకే తమకు తీరిక దొరికినప్పుడల్లా ప్రశాంతంగా సినిమాలకు దూరంగా విదేశాలకు టూర్లు వెళ్తుంటామని ఆయన అంటారు. అయితే ఈ విధంగా ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతూ వారితో సరదాగా ఎంజాయ్ చేస్తూ, మరోవైపు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండే మహేష్ బాబు పై సినిమా ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం, మీలాగా ఫ్యామిలీకి అంత బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి, వారికి కొంత సమయాన్ని కేటాయించేవారు టాలీవుడ్ లో చాలా తక్కువమంది ఉన్నారు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: