'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' ట్రైలర్ : చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం....!!

GVK Writings

హాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఆ సినిమా అన్ని దేశాల్లోనూ మంచి వసూళ్లు అందుకుంది. ఇక అక్కడి నుండి వరుసగా వస్తున్న ఆ సినిమా సీక్వెల్స్ లో చాలా వరకు మంచి సక్సెస్ సాధిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల వచ్చిన ఫ్యూరియస్ 8 మాత్రం ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందుకోకపోవడంతో, తదుపరి తీయబోయే ఎఫ్9 ని మరింతగా శ్రద్ధ పెట్టి తెరకెక్కించినట్లు సమాచారం. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

ఇప్పటివరకు ఈ సినిమాల సిరీస్ లో అలరించిన ప్రముఖ రెజ్లర్ కం నటుడైన రాక్ స్థానంలో ఈ సినిమా ద్వారా మరొక రెజ్లర్ జాన్ సేనా నటించడం జరిగింది. ఇక ట్రైలర్ లో అదిరిపోయే విజువల్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తిని రేకెత్తించడం ఖాయం అనే చెప్పాలి. ఇక గత భాగాలతో పోలిస్తే ఈ సినిమాకు మరింత భారీగా ఖర్చుపెట్టిన చిత్ర బృందం, సినిమాని ఎక్కగా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో దీనిని తెరకెక్కించినట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే చాలా వరకు చెప్పవచ్చు. ఈ సినిమా ప్రధాన పాత్రధారి విన్ డీజిల్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు. 

 

జస్టిన్ లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వన్ రేస్ ఫిలిమ్స్ సంస్థ కొన్ని వేల కోట్ల రూపాయలతో తెరకెక్కించడం జరిగింది. మిచెల్లీ రోడ్రిగ్వుజ్, టైరసి గిబ్సన్, క్రిస్ బ్రిడ్జెస్, జోర్డానా బ్రీయుస్టర్, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ ని బ్రియాన్ టైలర్ అందించగా, స్టీఫెన్ విండన్ ఫోటోగ్రఫిని అందించారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని మే22 న రిలీజ్ చేయనున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

" height='150' width='250' src="https://www.youtube.com/embed/aSiDu3Ywi8E" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: