ప్రియురాలిని పెళ్లాడిన బిగ్ బాస్ 3 ఫేమ్ హీరో
ప్రస్తుతం మహత్ రాఘవేంద్ర అనేక చిత్రాలతో బిజీ లైఫ్ కొనసాగిస్తున్నాడు. తమిళ్ చిత్రాలలో మంచి రోల్స్ కి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా హాట్ బ్యూటీ అలాగే మోడల్ ఐనటువంటి ప్రాచి మిశ్రా ,మహత్ మధ్య చాలా కాలంగా ఎఫ్ఫైర్ కొనసాగుతుందన్న విషయం అందరికి తెలిసిందే .
ఎట్టకేలకు బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3 ఫేమ్ మహత్ రాఘవేంద్ర ఓ ఇంటివాడయ్యాడు. గతేడాది తన గాళ్‌ఫ్రెండ్ ప్రాచీ మిశ్రాతో మహత్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చివరగా ఈ జంట.. శనివారం రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని ఓ బీచ్ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్, ప్రాచీల పెళ్లి జరిగింది. ప్రైవేటుగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు శింభు, అనిరుధ్‌లు కూడా పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు.
కాగా, పెళ్లికి మూడు రోజుల క్రితం మహత్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన ఫాన్స్ కొరకు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అందులో ప్రాచీతో తన జర్నీని వివరించాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాతో మహత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. తమిళ ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించాడు.