ఆ విషయంలో సమంత చాలా డేంజరస్... శర్వానంద్

సమంత, శర్వానంద్ నటించిన చిత్రం ‘జాను’ మూవీ ఈనెల ౭వ తేదీన విడుదల కానుంది. చిత్రయూనిట్ మూవీ రిలీజ్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌ కు హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడారు. ఈవెంట్‌ కి వచ్చిన నాని, సమంత, నా అభిమానులకు చాలా చాలా  థాంక్స్. అయన సమంత గురించి మాట్లాడుతూ..  ఆమె గురించి మాట్లాడాలంటే.. ఆమె చాలా డేంజరస్. 

 

ఎందుకంటే చాలా మంది హీరోలకు పలానా హీరోయిన్‌ తో చేయాలంటే ఆలోచించుకుంటాము దాంట్లో ఆమె కూడా ఒకరు. ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు బెటర్ పెర్ఫామెన్స్‌ తో తినేస్తారు. సమంతతో నటించడం నాకు ఇదే తొలిసారి. సమంత సక్సెస్ సీక్రెట్ ప్రకారం ఆమె చేసే ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాగానే భావిస్తుంది. ఇప్పటికీ అలాగే చేస్తోంది. ఆమెను చూసి నేను నేర్చుకున్నా. ప్రతి సీన్‌ ను ఆమె చాలా కేర్ తీసుకుంటారు. అందుకే ఆమె సూపర్ స్టార్ అయ్యారు. ఆమెతో జాను చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.

 

అనంతరం శర్వానంద్ ‘జానీ’ సినిమా గురించి చెప్తూ.. లవ్ బ్రేకప్‌ ల గురించి మాట్లాడుతుండగా.. మరి మీ లవ్ బ్రేకప్ అయ్యిందా.. ? అని ఆడియన్స్ అడగడంతో శర్వానంద్ ఇలా మాట్లాడారు. నా లవ్ స్టోరీ కూడా జాను లవ్ స్టోరీ మాదిరే ఉంటుంది. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నిజంగా చెప్తున్నా.. అందుకే నాకు ఈ సినిమా కనెక్ట్ అయ్యింది.

 

ఈ మధ్య కాలంలో ఆరో తరగతి నుండి లవ్‌ లు మొదలౌతున్నాయి. ఆరో తరగతి అబ్బాయి నుండి 80 ఏళ్ల వరకూ అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే.. జీవితంలో ఏది జరిగినా ఎన్ని లవ్‌ లు వచ్చినా.. ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్వే. ఈ సినిమా చూస్తున్నంత సేపూ అర్రే.. ఈ సీన్ నాది కదరా అని ఇన్వాల్వ్ అవుతారు. చివరగా ఆయన కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ముగించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: