హీరో నిఖిల్ పెళ్లి.. అమ్మాయెవరో చూడండి..?

praveen

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత సినిమాలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకున్నాడు హీరో నిఖిల్ . మొదట హీరోగా కాస్త తడబడిన ఆ తర్వాత మాత్రం సినిమాల ఎంపికలు ఆచితూచి  అడుగులు వేస్తూ... మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్ . తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు నిఖిల్ సినిమా వస్తుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉంటారు. ఇక కథల ఎంపికలో కూడా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ పోతున్నాడు హీరో నిఖిల్. ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో  నిఖిల్కు మంచి సక్సెస్ రేటు ఉందనే చెప్పాలి. 

 

 

 గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్ తాజాగా వచ్చిన అర్జున్ సురవరం సినిమాతో కూడా మరో మంచి విజయాన్ని సాధించాడు. ఇదిలా ఉంటే హీరో నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ పెళ్లి పై సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలపై ఇప్పటివరకు హీరో నిఖిల్ స్పందించలేదు. అయితే నిఖిల్ పెళ్లి పై వస్తున్న వార్తలపై నిఖిల్ స్పందించక పోయినప్పటికీ తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫోటోల్లో  త్వరలో నిఖిల్  జరుగబోతున్నదని  అర్థమవుతుంది. 

 

 

 ఏప్రిల్ 16న నిఖిల్ వివాహం జరగనుంది. నిఖిల్ కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు హాజరై ఓ కార్యక్రమంలో పెళ్లి నిశ్చయించుకున్నారు  . కాకా నిశ్చితార్థం కార్యక్రమం ఓ ఐలాండ్ రిసార్ట్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సముద్రం మధ్యలో తన కాబోయే భాగస్వామికి నిఖిల్ ప్రపోజ్ చేశారు. నిఖిల్ పెళ్లాడబోయే  అమ్మాయి డాక్టర్ అని సమాచారం. ఆమె పేరు పల్లవి వర్మ. చాలా రోజుల నుండి నిఖిల్ పెళ్లి పై వస్తున్న వార్తలకు ఫోటోలతో  క్లారిటీ వచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: