టాలీవుడ్ బాద్షా ఈ పవర్ స్టార్: ప్ర‌జ‌ల హృద‌యాల్లో ప‌వ‌ర్ స్టారే కాదు.. సింపుల్ స్టార్ కూడా... !

venugopal

ఒక పెద్ద ఫ్యామిలీ అందులో అందరికంటే చిన్న వాడైన, అందరికి నచ్చే ముద్దుల తమ్ముడు పవన్ కళ్యాణ్. హీరోగా అన్నకు తగ్గట్టుగా పాపులారిటిని సొంతం చేసుకున్నాడు. అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి, కావలసినంతగా ధనం ఉన్నా ఏనాడు తన దర్పాన్ని ప్రదర్శించని వ్యక్తి పవన్.. చిత్రపరిశమలోకి రాకముందు అన్నచాటు తమ్మునిగా ఎదిగిన పవన్ అనతి కాలంలో తన వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకున్నాడు. ఉన్నతమైన భావాలు గల వ్యక్తిగా మారాడు.

 

 

ఆయన ఆలోచనల్లో కనిపించే  తేజం, ఆయన మాటల్లో కనిపించే ఆవేశం, ఆయనంటే ప్రత్యేకమైన అభిమానాన్ని మనుసులో కలిగిస్తాయి. ఇక్కడ వ్యక్తిగత జీవితం వేరు. వ్యక్తి జీవితం వేరు. ఒక వ్యక్తి కోసం ఆలోచిస్తున్నప్పుడు వ్యక్తిగత జీవితాన్ని పరిగణలోకి తీసుకోకూడదు.. ఇకపోతే విభిన్నమైన పాత్రల్లో నటించి, తనకంటూ ఎందరో అభిమానులను సంపాధించుకున్న పవన్ కళ్యాణ్ తానొక మెగాస్టార్ తమ్ముడిని అనే అహం ఎక్కడ ప్రదర్శించలేదు.. పవర్ స్టార్‌గా ఎదిగినా, తనపవర్ ఎక్కడా చూపించలేదు.

 

 

తన పని తాను చేసుకుంటూ వెళ్లడమే తాను నేర్చుకున్నదని నిరూపించాడు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, వివాదాలు ఎంతగా చుట్టుముట్టినా, తన జీవిత గమనంలో అడ్దంకులు ఎన్ని అడుగడుగునా విషసర్పాలుగా బుసకొట్టినా, తనలోని ఆవేశాన్ని అదిమిపెట్టుకుని, సాఫీగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు ఈ పవర్ స్టార్ పవనుడు.. ఇక రాజకీయాల్లోకి వచ్చాక కూడా అడుగడుగున ప్రజల అభినాన్ని, అభిమానుల నీరాజనాలని అందుకున్నాడు. ఇతని వెంట జనప్రభంజనం హోరెత్తి సాగింది. అక్కడ కూడా తాను ఒక సామాన్యుడిగానే ప్రవర్తించాడు.

 

 

ముఖ్యంగా ఒక మానవత్వం ఉన్న మనిషిగానే సింపుల్ జీవితాన్ని అనుభవించాడు. కోరుకుంటే కోట్లు తన దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నా, హయిగా షూటింగ్‌లు చేసుకుంటూ, పరదేశాలల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నా ఒక సమరయోధుడి జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని ప్రజలకు ఏదో చేద్దామని ఆశపడ్డాడు. అందుకే అభిమానులు అంటారు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ప‌వ‌ర్ స్టారే కాదు.. సింపుల్ స్టార్ కూడా మా అంజనీ పుత్రుడు పవనుడు అని..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: