గత ఏడాది హ్యాట్రిక్ డిజాస్టర్లను ఖాతా లో వేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఈఏడాది ప్రారంభం లో డిస్కోరాజా తో మరో డిజాస్టర్ ను చవిచూశాడు. మంచి అంచనాల మధ్య ఇటీవల విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ రివ్యూస్ ను రాబట్టుకోవడంతో విడుదలైన రెండో రోజు నుండే బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.
ఇక నిన్నటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 7.46కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈచిత్రం సుమారు 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించగా నేల టిక్కెట్టు నిర్మాత రవి తల్లూరి ఈచిత్రాన్ని నిర్మించాడు. ఈరెండు సినిమాలు రవి తల్లూరిని నిలువునా ముంచేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా డిస్కోరాజా వసూళ్ల వివరాలు :
నైజాం - 2.8 కోట్లు
సీడెడ్ - 0.9 కోట్లు
ఉత్తరాంద్ర - 0.85 కోట్లు
గుంటూరు -0.4 కోట్లు
తూర్పు గోదావరి - 0.55 కోట్లు
పశ్చిమ గోదావరి - 0.39 కోట్లు '
కృష్ణా - 0.42 కోట్లు
నెల్లూరు - 0.15 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో 10రోజులకు గాను షేర్ = 6.46కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా +రెస్ట్ అఫ్ వరల్డ్ = 1కోటి
ప్రపంచ వ్యాప్తంగా డిస్కోరాజా 10రోజుల షేర్ = 7.46 కోట్లు