తాత వర్ధంతి రోజున జూనియర్ సంచలన వ్యాఖ్యలు!

Seetha Sailaja
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తెలవారకుండానే నందమూరి కుటుంబంతో కాకుండా తన సన్నిహితులతో తన తాత నందమూరి తారక రామారావు సమాధిని ఆయన వర్ధంతి సందర్భంగా సందర్శించుకుని తనపై వస్తున్న రకరకాల వార్తలకు తెర దించే ప్రయత్నం మరోసారి చేసాడు జూనియర్. తెలుగుదేశం పార్టీ తన రక్తంలో భాగమని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు.  ఈరోజు శనివారం తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 18వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు నివాళులు అర్పిoచిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయవలసిన బాధ్యత తన మీద ఉంది అన్నాడు జూనియర్.  నటన తనకు బతుకుదెరువును ఇస్తోందని అంటు తాను ఎన్టీఆర్ కు మనవడిగా పుట్టడం తాను ఏనాడో చేసుకున్న పుణ్యం అని అన్నాడు జూనియర్. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు జూనియర్.  యంగ్ టైగర్ మాటలను బట్టి నందమూరి కుటుంబంతో సయోధ్యకు తాను సిద్దం అని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉన్నాయి జూనియర్ మాటలు. దీనిపై బాబాయి, మామయ్యలు ఎలా స్పందిస్తారో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: