రాశి ఖన్నా అభ్యంతరాలు విని షాక్ అయిన విజయ్ దేవరకొండ !
నిన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లో రాశి నటించిన ఓ బెడ్ రూం సీన్ ఆమె అభిమానులకు నచ్చలేదట. గ్లామర్, ఎక్స్పోజింగ్ విషయంలో కొంచెం హద్దుల్లోనే ఉంటూ ఎక్కువగా ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేసిన రాశి ఇలాంటి పాత్ర చేయడం ఏమిటి అంటూ ఆమెకు అనేక మెసేజ్ లు వచ్చాయట.
ఈ విషయాలను వివరిస్తూ రాశి కొన్ని కామెంట్స్ చేసింది. ఈ సినిమా టీజర్ చూసి తన అభిమానులు బాధ పడ్డ విషయం తన దృష్టికి వచ్చిందని అంతేకాకుండా తన అభిమానులు పడ్డ బాధ తనకు ఆవేదన కలిగించిందని కామెంట్స్ చేసాడు. అయితే తన అభిమానులు అనుకున్నట్లుగా ఈ సినిమాలో అశ్లీల సన్నివేశాలు లేవని వారు ఈ సినిమా చూసిన తరువాత ఈ సినిమా చూసిన తరువాత తాను ఈ సినిమా ఎందుకు చేసానో అర్ధం చేసుకుంటారని అభిప్రాయపడింది.
అంతేకాదు ఈ మూవీ తన కెరీర్లోనే కథ పరంగా ఈ సినిమా అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఉంటుందని కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో ఆమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఒక సన్నివేశంలో విజయ్ దేవరకొండ నటనకు ముగ్ధురాలైన తాను అతడి దగ్గరికెళ్లి హగ్ చేసుకున్న విషయాన్ని బయటపెట్టి ఈ మూవీ పై అంచనాలు పెంచడానికి తనవంతు ప్రయత్నాలు చేసింది.
ఈ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తరువాత తాను ప్రేమ కథ సినిమాలు చేయనని మారుతున్న ప్రేక్షకుల అభిరుచుని బట్టి తాను కూడ డిఫరెంట్ కథలు ఉన్న సినిమాలు చేస్తాను అంటూ చెప్పడంతో ఇక రానున్న రోజులలో తన లిప్ లాక్ సీన్స్ తన సినిమాలలో కనిపించవు అన్న విషయాలను పరోక్షంగా విజయ్ దేవరకొండ తెలియచేసాడు..